Intel : ఉద్యోగులను తొలగించం గానీ .. జీతాల్లో కోత తప్పదంటున్న ఇంటెల్..

పెద్ద దిగ్గజ కంపెనీలు సైతం ఆర్థిక మాంద్యం దెబ్బకు ఉద్యోగుల భారం తగ్గించుకుంటున్నాయి. వేలాదిమంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. కానీ ‘చిప్’ రారాజు ఇంటెల్ మాత్రం ఉద్యోగులను తొలగించం అని చెప్పింది. కానీ ఆర్థిక భారం తగ్గించుకోవటానికి మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Intel : ఉద్యోగులను తొలగించం గానీ .. జీతాల్లో కోత తప్పదంటున్న ఇంటెల్..

Intel  Employee Salaries cuting

Intel : పెద్ద దిగ్గజ కంపెనీలు సైతం ఆర్థిక మాంద్యం దెబ్బకు ఉద్యోగుల భారం తగ్గించుకుంటున్నాయి. వేలాదిమంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి టెక్ కంపెనీలు సైతం. కానీ ‘చిప్’ రారాజు ఇంటెల్ మాత్రం ఉద్యోగులను తొలగించం అని చెప్పింది. కానీ ఆర్థిక భారం తగ్గించుకోవటానికి మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. అదేమంటే ఉద్యోగులను తొలగించడానికి బదులుగా జీతాల్లో కోత తప్పదంటోంది. ఇది ఉద్యోగులకు గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఉంది ఇంటెల్ తీసుకున్న ఈ నిర్ణయం. ఈ జీతాల కోత అన్నీ స్థాయిల ఉద్యోగుల మీద పడనుంది. కంపెనీ సీఈవో స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు జీతాల కోత తప్పదని తేల్చి చెప్పింది.

Layoff in paypal : పేపాల్​లో 2,000 మంది ఉద్యోగుల తొలగింపు .. ప్రకటించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్

ఆర్థిక మాంద్యం దెబ్బకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం వేలాదిమంది ఉద్యోగుల్ని తీసేస్తుంటే ఇంటెల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటంపై హర్షం వ్యక్తం అవుతోంది.ఆర్థిక భారం తగ్గించుకోవటానికి ఉద్యోగుల్ని తీసివేస్తే వారి రోడ్డున పడతారని అదే జీతంలో కోత విధిస్తే కొంతలో కొంత భారం తప్పకపోయినా వారికి కాస్త వెలుసుబాటుగా ఉండాలనే ఆలోచనతో ఇంటెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పైగా జీతాల కోత క్రిందిస్థాయి ఉద్యోగులపైనే కాకుండా అందరికి తప్పదని ఆఖరికి సీఈవోకు సైతం జీతం కోత తప్పదని చెప్పటం ఇంటెల్ విభిన్న నిర్ణయాన్ని నిపుణులు కొనియాడుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో జీతం తగ్గినా పర్వాలేదు కానీ ఉన్నపళంగా ఉద్యోగం పోతే వారి పరిస్థి కష్టమని భావించింది ఇంటెల్. జీతాల కోతతో కాస్త ఆర్థిక భారం తగ్గించుకుంటునే తన ఉద్యోగుల్ని నిర్ధాక్షిణ్యంగా రోడ్డుమీదకు నెట్టేయకుండా ఇంటెల్ తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానించాల్సిందేనంటున్నారు నిపుణులు..

Amazon Lay Off Employees : ఉద్యోగులను తొలగిస్తున్న అమెజాన్.. భారత్ లో 1000 మంది

కాగా.. ఇంటెల్ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో సంస్థ సీఈవో పాట్ గెల్‌సింగర్‌ వేతనంలో 25 శాతం కోత విధిస్తోంది. అలాగే ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులకు 15 శాతం, సీనియర్ మేనేజర్లకు 10 శాతం, మధ్యస్థాయి మేనేజర్ల స్థాయిలో ఉన్నవారికి 5 శాతం కోత విధించనుంది కంపెనీ. ఆర్థిక పరమైన భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరింది.

IT Jobs Cut : ఊడుతున్న ఉద్యోగాలు.. ఐటీ ఉద్యోగులకు గడ్డు కాలం, ముందు ముందు మరింత దారుణం.. కోతలకు కారణం అదేనా?