Russia Ukraine war: శాంతి చర్చల్లో పురోగతి లేదు, అధ్యక్షుల భేటీ ఇప్పుడే కాదు: రష్యా

యుద్ధాన్ని ఆపి.. నేరుగా పుతిన్ తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానంటూ యుక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రతిపాదనపై రష్యా స్పందించింది.

Russia Ukraine war: శాంతి చర్చల్లో పురోగతి లేదు, అధ్యక్షుల భేటీ ఇప్పుడే కాదు: రష్యా

Ukraine Russia

Russia Ukraine war: యుద్ధాన్ని ఆపి.. నేరుగా పుతిన్ తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానంటూ యుక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రతిపాదనపై రష్యా స్పందించింది. ఇరు దేశాల మధ్య ఇటీవల జరిపిన శాంతిచర్చల్లో పురోగతి లేనందున ఇప్పుడపుడే ఈ భేటీ సాధ్యపడదని క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. రష్యా – యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నందున.. శాంతి చర్చలపై ఆధారపడడం తప్ప..యుద్ధాన్ని ఆపడం అనేది సాధ్యపడదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో యుక్రెయిన్ అధ్యక్షుడు భేటీ అవుతానని చెప్పడం తొందరపాటు నిర్ణయం అంటూ డిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్యానించారు. నాటోలో చేరడంపై యుక్రెయిన్ వెనక్కుతగ్గిన నేపథ్యంలో ఆదేశాధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారు.

Also Read:Chernobyl Danger : చెర్నోబిల్ డేంజర్ బెల్స్.. యుక్రెయిన్‌తో పాటు సరిహద్దు దేశాలకు పొంచి ఉన్న ముప్పు

ఈ విషయంపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమవారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ..”ఇది ప్రతిఒక్కరికీ రాజీ అవుతుంది: నాటోకు సంబంధించి మనతో ఏమి చేయాలో తెలియని పశ్చిమ దేశాలకు, భద్రతా హామీలను కోరుకునే ఉక్రెయిన్‌కు మరియు నాటో విస్తరణను కోరుకోని రష్యాకు, ఇదే రాజీ మార్గం” అని జెలెన్స్కీ అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో నేరుగా సమావేశమైతే తప్ప రష్యా కూడా యుద్ధాన్ని ఆపాలనుకుంటుందో లేదో అర్థం చేసుకోలేమని జెలెన్స్కీ అన్నారు.

Also read:Petrol Price Hike: పెట్రోల్ ధరల పెంపు: బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎటాక్

శాంతి చర్చలు సఫలం అయితే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ అనంతరం రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న క్రిమియా మరియు తూర్పు డోన్‌బాస్ ప్రాంతం గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, అదే సమయంలో యుక్రెయిన్ కు రక్షణ హామీలను అందించే దిశగా రష్యాతో చర్చలు జరపాలని జెలెన్స్కీ పేర్కొన్నారు. యుద్ధం కారణంగా రెండు దేశాలు తీవ్ర నష్టాన్ని మూటగట్టుకున్నాయని, కానీ ఇంతవరకు ఇది ఎటు తేలలేకుండా ఉందని జెలెన్స్కీ పేర్కొన్నారు.

Also Read:Pakistan : పాకిస్థాన్‌లో 18 ఏళ్ల‌ హిందూ యువతి కాల్చివేత..