Baby Can’t Cry : నా బిడ్డ ఏడుపు వినాలని ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నా..ఓ తల్లి ఆవేదన

నా బిడ్డ ఏడుపు వినాలని ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నా..దయచేసిన నా బిడ్డను ఏడిపించండీ అంటూ ఓ తల్లి ఆవేదన వ్యక్తంచేస్తోంది.

Baby Can’t Cry : నా బిడ్డ ఏడుపు వినాలని ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నా..ఓ తల్లి ఆవేదన

Baby Not Cry

six mounths Baby Can’t Cry : బిడ్డ ఆకలితో ఏడ్చినా తల్లి మనస్సు తల్లిడిల్లిపోతుంది. కానీ ఓ తల్లి మాత్రం తన బిడ్డ ఏడుపు వినాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. ఆరు నెలల నుంచి బిడ్డ ఏడుపు వినాలని ఆరాటపడుతోంది. ఎందుకంటే ఆమెకు బిడ్డ పుట్టి ఆరు నెలలు గడిచింది. కానీ పుట్టినప్పటినుంచి ఆ బిడ్డ ఏడవనేలేదు. ఎందుకంటే..ఆ బిడ్డకు వింత వ్యాధితో బాధపడుతోంది. ప్రసవం అయ్యాక శిశువు ఏడవకపోతే తల్లే కాదు డాక్టర్లు కూడా కంగారుపడతారు. అలాగే కంగారుపడ్డారు కెనడాలోని ఓ మహిళలకు పుట్టిన బిడ్డను చూసిన డాక్టర్లు. తనకు ప్రసవం కాగానే తన బిడ్డ ఏడుపు వినపించకపోయేసరికి ఆ తల్లికూడా కంగారుపడింది. తన బిడ్డకు ఏమయ్యిందోనని..పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ ఏడిస్తే ఆతల్లికి ఎంతో ఆనందం. ఆ తరువాత ఇక బిడ్డను ఏడవకుండా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది.

Read more : AP : పూళ్లలో వింత వ్యాధి..ఫిట్స్ తో పడిపోతున్న జనాలు

కానీ కెనడాకు చెందిన లుసిండా ఆండ్రూస్ అనే మహిళకు పుట్టిన మగబిడ్డ ఏడవలేదు. డాక్టర్లు కూడా ఎన్నో విధాలుగా యత్నించి చూశారు కానీ బిడ్డ అస్సలు ఏడవలేదు. దీంతో లుసిండా గుండెలు గుభేలుమన్నాయి. ఏమైంది డాక్టర్ అని అడిగింది ఆతృతగా..కానీ సజీవంగానే ఉన్నాడు. దీంతో కాస్త ఊపిరి తీసుకున్నడాక్టర్లు ఏంకాలేదమ్మా బిడ్డ బాగానే ఉన్నాడు కంగారుపడొద్దని చెప్పారు. దీంతో లుసిండా కాస్త తేరుకుంది.

కానీ రోజులు..వారాలు గడుస్తున్నాయి. కానీ బిడ్డ మాత్రం ఒక్కసారికూడా ఏడవలేదు. దీంతో ఆ తల్లిలో ఆందోళన మొదలైంది. ఎంతోమంది డాక్టర్లకు..నిపుణులకు చూపించింది. ‘ప్లీజ్ నాబిడ్డ ఏడుపు వినాలని ఉంది. ఒక్కసారి అయినా ఏడిపించండీ’అంటూ వేడుకునేది. అలా లుసిండా బిడ్డ పుట్టి ఆరు నెలల బిడ్డ ఏడుపు ఇంతవరకు వినలేదు. కానీ ఆ పిల్లాడు ఏడకపోవటానికి ఈ అరుదైన వ్యాధి అని మాత్రం చెప్పారు.

Read more: హాయిగా నిద్రపోండి : ప్రపంచ నిద్ర దినోత్సవం

ఏంటీ వింత వ్యాధి అంటూ నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు. దీంతో ఆ బిడ్డపై దృష్టిపెట్టిన నిపుణులు అధ్యయనం చేస్తుస్తున్నారు. కానీ ఆ వ్యాధి ఏంటో..ఎందుకలా ఏడవలేకపోతున్నాడో వారికి కూడా అంతుపట్టటం లేదు. దీంతో నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఆ పిల్లవాడి చికిత్స గురించి తల్లి చాలా ఆందోళన చెందుతుంది. ముద్దులొలికే బిడ్డ ఏడవకపోవడం తల్లికి ఆందోళన కలిగిస్తుంది. తన బిడ్డను వింత వ్యాధి బారి నుంచి కాపాడటానికి..ఈ దిశగా మరింతగా పరిశోధన చేయాలని లుసిండా అభ్యర్థిస్తోంది.

Read more: World Mental Health Day 2020 : ఒత్తిడిని జయించండి..హాయిగా నిద్రపోండి..

32 ఏళ్ల లూసిండా మార్చి 5,2021 న ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. గర్భధారణ సమయంలో ఆమెకు ఎలాంటి సమస్యలు లేవు. కానీ పిల్లాడు పుట్టిన ఏడవలేదు. దీంతో ఆందోళన వ్యక్తంచేశారు డాక్టర్లతో పాటు లుసిండా కూడా. కానీ సజీవంగానే ఉండటంతో కొంతలో కొంత ఊరట చెందింది లుసిండా. కానీ ఏడవకపోవటంతో పాటు చేతులు, కాళ్ళు కదలడం లేదని డాక్టర్లు గుర్తించారు. పిల్లవాడు తన తలని కూడా సరిగా కదిలించలేకపోయాడు. దీంతో లుసిండా ఆందోళన పెరిగిపోయింది. ఏదొకటి చేసి నా బిడ్డకు ఉన్న సమస్య ఏంటో తెలుసుకోండి..వైద్యం చేయండీ అంటూ వేడుకుంటోంది.

అలా పలు వైద్య పరీక్షలు చేసిన తరువాత బిడ్డకు జన్యుపరమైన సమస్య ఉన్నట్లు గుర్తించారు. దీంతో శరీరంలో ప్రోటీన్ స్థాయి ప్రభావితమవుతుంది. లుసిండా తనయుడికి శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉంది. పలు అధ్యయనాల అనంతరం.. ఇది నవజాత శిశువులో TBCD జన్యువును ప్రభావితం చేసే చాలా అరుదైన వ్యాధి అని తేలింది. ఇలాంటి కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి. దీనిపై పరిశోధనలు జరగలేదు. ఇప్పుడు లుసిండా శాస్త్రవేత్తలు ఈ దిశలో కొంత పరిశోధన చేయాలని కోరుకుంటున్నారు. కాగా లుసిండా స్వయంగా ఈ అరుదైన వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.