Imran Khan Arrest: ఇమ్రాన్‌ ఖాన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట.. ఎన్ఏబీకి చీవాట్లు

అల్ ఖదీర్ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి 5,000 కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో మంగళవారం ఇమ్రాన్ ఖాన్‭ను పారామిలిటరీ రేంజర్లు అరెస్ట్ చేశారు. కాగా, ఈ అరెస్టును సుప్రీంకోర్టులో ఇమ్రాన్ పార్టీ పీటీఐ సవాలు చేసింది

Imran Khan Arrest: ఇమ్రాన్‌ ఖాన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట.. ఎన్ఏబీకి చీవాట్లు

Imran Khan Arrest: పాకిస్తాన్ మాజీ ముఖ్యమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్‭ను తక్షణమే విడుదల చేయాలని జాతీయ జవాబుదారీ బ్యూరో(ఎన్ఏబీ)ను పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతే కాకుండా గంటలోపు కోర్టు ముందు ఇమ్రాన్‭ను హాజరుపర్చాలంటూ ఆదేశించింది. ఇమ్రాన్ అరెస్ట్ అక్రమమని కోర్టు అభిప్రాయపడింది. అంతే కాకుండా ఆయనను అరెస్టు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్ట్రార్ అనుమతి లేకుండా కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించి అరెస్టు చేయడంపై మండిపడింది. ఇమ్రాన్ అరెస్ట్ పూర్తిగా కోర్టు ధిక్కరణే అని సుప్రీం పేర్కొంది.

Karnataka Polls: డబ్బులు ఇచ్చి ఉండాల్సింది.. కర్ణాటక ఎన్నికలపై మాజీ సీఎం కుమారస్వామి హాట్ కామెంట్స్

అల్ ఖదీర్ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి 5,000 కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో మంగళవారం ఇమ్రాన్ ఖాన్‭ను పారామిలిటరీ రేంజర్లు అరెస్ట్ చేశారు. కాగా, ఈ అరెస్టును సుప్రీంకోర్టులో ఇమ్రాన్ పార్టీ పీటీఐ సవాలు చేసింది. జస్టిస్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దీనిని విచారణకు తీసుకుంది. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘90 మంది కోర్టు ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశిస్తే అప్పుడు న్యాయస్థానం మర్యాద ఏమవుతుంది. కోర్టు లోపలే ఓ వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారు’’ అంటూ ప్రశ్నించింది.

Naveen Patnaik: బాంబు పేల్చిన సీఎం నవీన్ పట్నాయక్.. మూడో కూటమి అసలే సాధ్యం కాదట

‘‘అరెస్టుకు ముందు అధికారులు కోర్టు రిజిస్ట్రార్ నుంచి అనుమతి తీసుకోవాలి. అలా చేయలేదు. ఇది పూర్తిగా కోర్టు ధిక్కరణే. అరెస్టు క్రమంలో న్యాయస్థానం సిబ్బంది కూడా వేధింపులను ఎదుర్కొన్నారు’’ అని కోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్ ఖదీర్ ట్రస్టు కేసులో ఇమ్రాన్‭కు 8 రోజుల జాతీయ జవాబుదారీ బ్యూరో(ఎన్ఏబీ) కస్టడీకి అప్పగిస్తూ అవినీతి నిరోధక కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. కాగా, మరుసటి రోజే ఆయనను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం గమనార్హం.