WHO Covaxin : కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. అక్టోబర్ 6న కీలక సమావేశం

దేశీయ ఫార్మా సంస్థ భార‌త్ బ‌యోటెక్ అభివృద్ది చేసిన క‌రోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్. కాగా, ఈ టీకాకు ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నుంచి అత్యవసర వినియోగం గుర్తింపు (ఎ

WHO Covaxin : కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. అక్టోబర్ 6న కీలక సమావేశం

Who Covaxin

WHO Covaxin : దేశీయ ఫార్మా సంస్థ భార‌త్ బ‌యోటెక్ అభివృద్ది చేసిన క‌రోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్. కాగా, ఈ టీకాకు ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నుంచి అత్యవసర వినియోగం గుర్తింపు (ఎమర్జెన్సీ యూజ్‌ ఆథరైజేషన్-EUL‌) రాలేదు. భారత్ స‌హా కొన్ని దేశాల్లో ఇప్ప‌టికే వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగం కొన‌సాగుతున్నా… డ‌బ్ల్యూహెచ్ఓ గుర్తింపు పొందిన క‌రోనా వ్యాక్సిన్స్ లిస్టులో మాత్రం కొవాగ్జిన్ లేదు.

కాగా, కొవాగ్జిన్ అత్యవసర గుర్తింపునకు సంబంధించి డబ్ల్యూహెచ్ఓకి చెందిన స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎక్స్ పర్ట్స్ ఆన్ ఇమ్యునైజేషన్ (SAGE) అక్టోబర్ 6న డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Free Storage: ఫోన్‌లో ఫోటోలు సేవ్ చేసుకునేందుకు ఆన్‌లైన్ స్టోరేజ్ ‘ఫ్రీ’గా కావాలా?

SAGE ముసాయిదా ఎజెండా ప్రకారం, టీకాను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ అక్టోబర్ 6న క్లినికల్ ట్రయల్స్ (దశ 1-3 ట్రయల్ ఫలితాలు, పోస్ట్ మార్కెటింగ్) రిస్క్ మేనేజ్‌మెంట్ ప్లాన్ల వ్యాక్సిన్ భద్రత, సమర్థత డేటాపై ప్రజెంటేషన్ ఇస్తుందని భావిస్తున్నారు. కాగా, ఇటీవల EUL కోసం WHO కి కొవాగ్జిన్ టీకాకు సంబంధించిన మొత్తం డేటాను భారత్ బయోటెక్ సమర్పించింది.

అక్టోబర్ 6న జరిగే సెషన్ లో కొవాగ్జిన్ సమర్పించిన డేటాపై డిస్కస్ చేస్తారు. ఫేజ్ 1, 2, 3 ట్రయల్స్, కొవాగ్జిన్ క్లినికల్ డేటా, భద్రత, ఇమ్యునోజెనిసిటీ, సమర్థతపై పోస్ట్ మార్కెటింగ్ స్టడీస్‌ని క్షుణ్ణంగా చర్చిస్తుందని, టీకా భద్రతా పర్యవేక్షణ కోసం ప్రపంచ, ప్రాంతీయ, దేశ స్థాయి ప్రణాళికలను అప్‌డేట్ చేస్తారని తెలిసింది.

WhatsApp Tricks : వాట్సాప్‌లో టైప్ చేయకుండానే మెసేజ్ పంపొచ్చు.. ఇదిగో ప్రాసెస్!

ప్రస్తుతం టీకా తయారీదారు సమర్పించిన డేటాను డబ్ల్యూహెచ్ఓ సమీక్షిస్తోంది. WHO వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న అప్‌డేట్ ప్రకారం, కొవాగ్జిన్ టీకాపై నిర్ణయం తీసుకోవాల్సిన తేదీ ఇంకా నిర్ధారించబడలేదు.

డబ్ల్యూహెచ్ఓ వెబ్ సైట్ లో ఉన్న డేటా ప్రకారం.. జూలై 6 నుంచి వ్యాక్సిన్ డేటాను డబ్ల్యూహెచ్ఓ సమీక్షిస్తోంది. భారత్ లో ఆరు వ్యాక్సిన్లకు భారత డ్రగ్ రెగులేటర్ నుంచి అత్యవసర వినియోగం అనుమతి ఇచ్చారు. అందులో కొవాగ్జిన్ ఒకటి. ఇంకా కొవిషీల్డ్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

అంతర్జాతీయ గుర్తింపు లేని కారణంగా ‘కొవాగ్జిన్‌’ తీసుకున్న వ్యక్తులు మన దేశం నుంచి కొన్ని ఇతర దేశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ నుంచి కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి లభించాల్సి ఉంది. అదే జరిగితే ఈ సమస్యకు లభించినట్లు అవుతుంది. టీకాను ఇతర దేశాలకూ భారత్‌ బయోటెక్‌ అందించగలుగుతుంది. కొవాగ్జిన్‌ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత్‌ బయోటెక్‌, ఇప్పటికే డబ్ల్యూహెచ్‌ఓకు అందించింది. దీనిపై పరిశీలన ప్రక్రియ చివరిదశకు చేరుకున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ వర్గాలు తెలిపాయి.

ఇప్పటివరకు ఫైజర్‌-బయోఎన్‌టెక్‌, ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా, అమెరికాకు చెందిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మొడెర్నా, చైనాకు చెందిన సినోఫామ్‌ టీకాలకు డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర గుర్తింపు లభించింది. స్పుత్నిక్‌-వి టీకాకూ అత్యవసర గుర్తింపు ప్రక్రియ చివరి దశలో ఉంది. త్వరలో కొవాగ్జిన్ కు కూడా అత్యవసర గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నారు. అదే జరిగితే, దీనివల్ల ఈ టీకా తీసుకున్న వ్యక్తులు విదేశాలకు ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రయాణించే అవకాశం ఏర్పడుతుంది.