IPL 2023, KKR vs PBKS: ఈ లెక్క‌న పంజాబే గెలుస్తుంద‌ట‌.. ఇదేం లాజిక్ అండీ బాబు..?

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్‌లో పంజాబ్ కింగ్స్‌తో నేడు(సోమ‌వారం) కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ త‌ల‌ప‌డ‌నుంది. బ‌లాబ‌లాలు, గెలుపోట‌ముల రికార్డులు కాసేపు ప‌క్క‌న పెడితే మాత్రం ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజ‌యం సాధిస్తుంద‌ని అంటున్నారు నెటీజ‌న్లు.

IPL 2023, KKR vs PBKS: ఈ లెక్క‌న పంజాబే గెలుస్తుంద‌ట‌.. ఇదేం లాజిక్ అండీ బాబు..?

Punjab Kings ( pic IPL Twitter)

IPL 2023, KKR vs PBKS: ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్‌(IPL) 2023 సీజ‌న్‌లో మ్యాచ్‌లు హోరా హోరీగా సాగుతున్నాయి. కొన్ని మ్యాచ్‌లు త‌ప్పిస్తే ఎక్కువ మ్యాచ్‌లు అంచ‌నాల‌కు ఏ మాత్రం అంద‌డం లేదు. విజ‌యం వ‌ర‌కు వ‌చ్చి బోల్తా ప‌డిన జ‌ట్లు కొన్నైతే ఖ‌చ్చితంగా ఓడి పోతాయనుకున్న త‌రుణంలో అద్భుతాలు చేసి గెలిచిన జ‌ట్లు మ‌రికొన్ని. ఇలా ఆద్యంతం ఆస‌క్తి బ‌రితంగా మ్యాచ్‌లు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్‌లో పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)తో నేడు(సోమ‌వారం) కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(Kolkata Knight Riders) త‌ల‌ప‌డ‌నుంది.

బ‌లాబ‌లాలు, గెలుపోట‌ముల రికార్డులు కాసేపు ప‌క్క‌న పెడితే మాత్రం ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజ‌యం సాధిస్తుంద‌ని అంటున్నారు నెటీజ‌న్లు. సెంటిమెంట్ అనండి లేదా లాజిక్ అనుకోండి ఏదైనా కానివ్వండి. దీనికి ఓ కార‌ణం కూడా చెబుతున్నారు. ఈ సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ ఆడిన మ్యాచ్‌ల‌ను బేరీజు వేసుకుని వాళ్లు ఈ విష‌యాన్ని చెబుతున్నారు.

PBKS

PBKS (pic IPL Twitter)

IPL 2023: ఆఖ‌రి బంతికి స‌మ‌ద్ స్ట్రైక్‌కు ఎలా వ‌చ్చాడు..? అలా రావొచ్చా..?

ఈ సీజ‌న్‌ను పంజాబ్ కింగ్స్ వ‌రుస విజ‌యాల‌తో మొద‌లుపెట్టింది. మొద‌టి రెండు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించిన ఆ జ‌ట్టు త‌రువాత రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. ఆ త‌రువాత ఓ మ్యాచ్‌లో గెలుస్తూ మ‌రో మ్యాచ్‌లో ఓడుతూ వ‌స్తోంది. ఈ సీజ‌న్‌లో పంజాబ్ ఆడిన మ్యాచుల్లో ఫ‌లితాలు ఇలా ఉన్నాయి.. W, W, L, L, W, L, W, L, W, L ( ఇక్క‌డ W-win, L-lost అని అర్థం). ఈ లెక్క‌న నేడు కోల్‌క‌తా మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజ‌యం సాధిస్తుంద‌ని అంటున్నారు. మ‌రీ వారి అంచ‌నాలు నిజం అవుతాయా..? లేక గ‌త మ్యాచ్‌లో ఎదురైన ప‌రాభ‌వానికి కోల్‌క‌తా ప్ర‌తీకారం తీర్చుకుంటుందా..? అన్న‌ది చూడాల్సిందే.

Rohit Sharma: రోహిత్.. నీ పేరును ‘నో హిట్ శ‌ర్మ’ గా మార్చుకో.. కృష్ణమాచారి శ్రీకాంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఈ సీజ‌న్‌లో పంజాబ్ ఇప్ప‌టి వ‌ర‌కు 10 మ్యాచ్‌లు ఆడింది. 5 మ్యాచుల్లో గెలిచి పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో ఉంది. అటు కోల్‌క‌తా కూడా ప‌ది మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచుల్లో విజ‌యం సాధించి ఎనిమిదో స్థానంలో కొన‌సాగుతోంది. ఈ రోజు జ‌రిగే మ్యాచ్‌లో పంజాబ్ విజ‌యం సాధిస్తే 12 పాయింట్ల‌తో ఏకంగా మూడో స్థానానికి చేరుకుంటుంది.