Karnataka Elections 2023: మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్పను బీజేపీ ఇలా వాడుకుంటోంది: కాంగ్రెస్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ నేతలతో ఢిల్లీలో నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్వహించిన సమావేశానికి యెడియూరప్పను దూరంగా ఉంచింది.

Karnataka Elections 2023: మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్పను బీజేపీ ఇలా వాడుకుంటోంది: కాంగ్రెస్

Bs Yediyurappa

Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆ రాష్ట్ర రాజకీయ నేతలు బిజీబిజీగా ఉంటున్నారు. అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక విషయంలో తర్జనభర్జనలు పడుతున్నాయి. పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత యెడియూరప్ప (BS Yediyurappa) ను బీజేపీ టిష్యూ పేపర్ లా వాడుకుంటోందని కాంగ్రెస్ విమర్శించింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections 2023) నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ నేతలతో ఢిల్లీలో నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్వహించిన సమావేశానికి యెడియూరప్పను దూరంగా ఉంచింది. ఇది సీనియర్ లింగాయత్ (Lingayat community) నాయకుడు యెడియూరప్పను ఘోరంగా అవమానించడమేనని చెబుతూ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో పేర్కొంది.

కర్ణాటకలో బీజేపీని శక్తిమంతం చేసిన యెడియూరప్పకు సమావేశంలో చోటు దక్కలేదని విమర్శించింది. ఎవరికి టికెట్ ఇవ్వాలన్న విషయంపై నిర్ణయాన్ని తెలిపే స్వేచ్ఛ ఆయనకు లేదా అని ప్రశ్నించింది. బీజేపీ చేతిలో యెడియూరప్ప మళ్లీ వాడకానికి పనికిరాని టిష్యూ పేపర్ గా మారారని విమర్శించింది.

సమావేశానికి ఆహ్వానించకపోవడంపై యెడియూరప్ప స్పందించారు. ఎన్నికల వేళ తాను పార్టీకి ఏ సూచనలు చేయాలనుకుంటున్నానో ఆ సూచనలు చేశానని, బీజేపీ అధిష్ఠానం వాటికి అంగీకరించిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాము పూర్తి మెజార్టీతో గెలుస్తామని అన్నారు.

Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి ఎదురుదెబ్బ