MLC Kavitha : ఇప్పుడు రాజకీయ పార్టీలను టార్గెట్ చేసిన బీజేపీ రేపు ప్రజల్ని కూడా టార్గెట్ చేస్తుంది : కవిత

ఇప్పుడు రాజకీయ పార్టీలను టార్గెట్ చేసిన బీజేపీ రేపు ప్రజల్ని కూడా టార్గెట్ చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేవరకు పోరాటం కొనసాగిస్తామని దీనిపై ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.

MLC Kavitha : ఇప్పుడు రాజకీయ పార్టీలను టార్గెట్ చేసిన బీజేపీ రేపు ప్రజల్ని కూడా టార్గెట్ చేస్తుంది : కవిత

BRS MLC Kavitha  round table meeting on the Women's Reservation Bill in Delhi

MLC Kavitha : బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈడీ,సీబీఐ దాడులతో భయపెట్టాలని చూస్తోందని..అటువంటి రాజకీయ పార్టీలకు కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందని కొంతకాలం పోతే బీజేపీ ప్రజల్ని కూడా టార్గెట్ చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపాల్సిందేనని అప్పటి వరకు తమ పోరాటం కొనసాగుతుందని భారత జాగృతి అధ్యక్షురాలు,బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయిందని విమర్శించిన కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే రాజకీయ పార్టీలను బీజేపీ టార్గెట్ చేసిందని రేపు ప్రజల్ని కూడా టార్గెట్ చేస్తుందంటూ ఘాటు ఆరోపణలు చేశారు కవిత. రిజర్వేషన్ బిల్లుపై ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని వెల్లడించిన కవిత..మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించేవరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

Delhi Liquor case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రేపు మరోసారి ఈడీ విచారణకు కవిత

కాగా..ఢిల్లీలో మార్చి 10న పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఒక రోజు దీక్ష చేసిన కవిత ఆ మరునాడే ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈక్రమలో మరోసారి ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నాం (మార్చి15,2023) 3గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించటానికి ఇప్పటికే కవిత ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. కవిత ఆధ్వర్యంలో మధ్యాహ్నాం 3గంటలకు రీ మెరిడియన్ హోటల్ లో జరుగనున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, పౌరసంఘాలు, మహిళా సంఘాల ప్రతినిథులు పాల్గొనున్నారు. మార్చి 11 చేపట్టిన ఒక రోజు దీక్షకు కొనసాగింపుగా కవిత ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు ఈ సమావేశం పూర్తి చేసుకుని రేపు కవిత బహుశా ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో రేపు ఈడీ విచారణకు హాజరు అవుతారని సమాచారం. మార్చి 11న ఈడీ విచారణకు హాజరైన కవితకు మార్చి 16న కూడా విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.

Supreme Court : ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సీజేఐ నిరాకరణ