Medical Courses Reservations : వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు.. కేంద్రం కీలక నిర్ణయం

వైద్య విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెంటల్, మెడికల్ కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఓబీసీ 27 శాతం, ఈబీడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసింది.

Medical Courses Reservations : వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు.. కేంద్రం కీలక నిర్ణయం

Medical Courses

medical courses reservations : వైద్య విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెంటల్, మెడికల్ కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఓబీసీ 27 శాతం, ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసింది. యూజీ, పీజీ, డెంటల్, మెడికల్ కోర్సులకు రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.

ఓబీసీ 27 శాతం, ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జులై 26న ప్రధాని మోడీ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. చాలా ఏళ్లుగా ఓబీసీలు, వెనకబడిన వర్గాలకు వైద్య విద్యలో రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించి త్వరిత గతిన నిర్ణయం తీసుకోవాలని ప్రధాని ఆదేశించడంతో ఈరోజు ఉత్తర్వులను వెలువరించారు.

ఆల్ ఇండియా కోటాలో రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి. ప్రతి ఏటా 5550 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగబోతుంది. సామాజిక న్యాయంలో ముఖ్యంగా కొత్త అధ్యాయంగా దీన్ని ప్రధాని మోడీ అభివర్ణించారు. ఎంబీబీఎస్ లో ప్రతి ఏడాది 1500 మంది విద్యార్థులకు, పీజీలో 2500 మంది ఓబీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన 550 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు, పీజీలో 1000 మంది మందికి ఈ రిజర్వేషన్లు అందుబాటులోకి రాబోతున్నాయి.

సుప్రీంకోర్టు 1986లోనే ఆల్ ఇండియా కోటాను ప్రవేశపెట్టింది. ఆల్ ఇండియా కోటాలో భాగంగా అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లి చదువుకునే వారికి కూడా ఆల్ ఇండియా కోటాలో ఓబీసీ, అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి ఈ రిజర్వేషన్లు అనేవి అందుబాటులోకి రానున్నాయి.

ఎస్సీ, ఎస్టీలకు ఇప్పటికే వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. 2007లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు ఆల్ ఇండియా కోటాలో ఉన్నాయి. తాజాగా ఓబీసీ, ఈడబ్య్లూఎస్ వర్గాలకు కూడా ఈ రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి.