Congress Supports AAP: అనూహ్య పరిణామం.. ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్

నిజానికి విపక్షాల రెండవ సమావేశంలో ఆప్ హాజరు పట్ల స్పష్టత లేదని కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా చెప్పింది. అయితే ఆర్డినెన్స్ విషయంలో మద్దతు ఇచ్చి, ఆ పార్టీని మీటింగుకి రప్పించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

Congress Supports AAP: అనూహ్య పరిణామం.. ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్

Congress Supports AAP: ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంలోని సర్వీసులపై స్థానిక ప్రభుత్వానికి పరిమితులు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ మీద కాంగ్రెస్ వైఖరి చెప్పాలంటూ అక్కడ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ చాలా రోజులుగా డిమాండ్ చేస్తోంది. వాస్తవానికి దేశంలోని చాలా స్థానిక పార్టీలు ఈ ఆర్డినెన్స్ మీద తమ వ్యతిరేకతను స్పష్టం చేశాయి. అయితే కాంగ్రెస్ మాత్రం మొదటి నుంచి ఆప్‭తో విభేదిస్తూ వస్తోంది. ఈ విషయంలో కూడా ఆ పార్టీ మౌనంగా ఉండడంపై ఇరు పార్టీల నేతల మధ్య తరుచూ మాటల దాడి జరుగుతోంది.

Mumbai : మమ్మీ అంటూ ఆర్తనాదాలు.. అందరూ చూస్తుండగానే అలల్లో కొట్టుకుపోయి.. విషాద యాత్రగా విహార యాత్ర

ఇదిలా ఉంటే.. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలు ఏకమయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గత నెల 23వ తేదీన బిహార్ రాజధాని పాట్నాలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో విపక్షాల తొలి సమావేశం జరిగింది. దేశంలో ప్రముఖ పార్టీలన్నీ దాదాపుగా హాజరయ్యాయి. అయితే ఈ సమావేశం కొనసాగుతున్న సమయంలో కూడా కేంద్రం ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండడంపై ఆప్ విమర్శలు గుప్పించింది.

Property Prices: మెట్రో నగరాల్లో క్రమంగా పెరుగుతోన్న ఇళ్ల ధరలు.. హైదరాబాద్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

ఇక రెండవ విపక్షాల సమావేశం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో రేపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్య మలుపు తీసుకుంది. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డెనెన్సుకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఇంతకాలం నాన్చుడు ధోరణితో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. సరిగ్గా విపక్షాల సమావేశానికి ముందు రోజే ఈ స్టాండ్ తీసుకోవడం పూర్తిగా రాజకీయ ఎత్తుగడ అని విమర్శకులు అంటున్నారు.

Governor Tamilisai : బోనాలకు ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు : గవర్నర్

కాగా, ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ‘‘వాళ్లు (ఆప్) రేపు మీటింగులో పాల్గొంటారనే మేము అనుకుంటున్నాము. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ విషయంలో మా వైఖరి స్పష్టంగా ఉంది. మేము దానికి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోము’’ అని అన్నారు. నిజానికి విపక్షాల రెండవ సమావేశంలో ఆప్ హాజరు పట్ల స్పష్టత లేదని కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా చెప్పింది. అయితే ఆర్డినెన్స్ విషయంలో మద్దతు ఇచ్చి, ఆ పార్టీని మీటింగుకి రప్పించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఆప్ స్థాపించినపప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీతో బద్ద వ్యతిరేకత కొనసాగుతోంది. తాజా పరిణామంతో ఆ రెండు పార్టీల మధ్య తొలిసారి ఒక ఏకాభిప్రాయం, మద్దతు లభించినట్లైంది.