Covid-19 Cases: భారత్‌లో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే..

భారత్‌లో కోవిడ్(covid-19) ఉధృతి కొనసాగుతోంది. మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్నటితో పోల్చుకుంటూ రెండువేలకుపైగా అదనంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24గంటల్లో కొత్తగా 12,249 మంది కోవిడ్ భారిన పడ్డారు.

Covid-19 Cases: భారత్‌లో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే..

Covid 19 (1)

Covid-19 Cases: భారత్‌లో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్నటితో పోల్చుకుంటే రెండువేలకుపైగా అదనంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24గంటల్లో కొత్తగా 12,249 మంది కోవిడ్ భారిన పడ్డారు. 13మంది కోవిడ్ తో చికిత్స పొందుతూ మృతిచెందారు. మంగళవారం మొత్తం 3,10,623 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 81,687కు చేరింది. దీంతో దేశంలో యాక్టివ్ కేసులు 0.19 శాతంగా నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు కరోనా భారిన పడినవారి సంఖ్య 4,33,31,645కు చేరింది.

Corona Cases : తెలంగాణ‌లో కొత్త‌గా 403 కరోనా కేసులు

ఇదిలాఉంటే కరోనాతో చికిత్స పొందుతూ 24గంటల్లో 13 మంది మరణించారు. దీంతో దేశంలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5,24,903కు చేరింది. గడిచిన 24గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ 9,862 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,27,25,055 కు చేరింది. ఇక దేశంలో రికవరీ రేటు 98.60శాతంగా నమోదైంది. కోవిడ్ వ్యాప్తిని నివారించేందుకు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. భారత్ లో 523 రోజులుగా  టీకా పంపిణీ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 196.45 కోట్ల డోసుల టీకాలు అందజేశారు. మంగళవారం ఒక్కరోజే 12,28,291 డోసుల టీకాలు వైద్య సిబ్బంది దేశవ్యాప్తంగా అందజేశారు.

Maharashtra Political Crisis: షిండే వెంట 40మంది ఎమ్మెల్యేలు.. ఉద్ధవ్ సర్కార్ కుప్పకూలడం ఖాయమా?

ఇదిలాఉంటే ఐసీఎంఆర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 85,88,36,977 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 1,437 ప్రభుత్వ లాబ్స్,1955 ప్రైవేట్ లాబ్స్ మొత్తం 3,392 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.