BJP : తెలంగాణ బీజేపీలో అసమ్మతి.. ఢిల్లీకి బండి సంజయ్ సహా కీలక నేతలు

ఇప్పటికే తెలంగాణలో బండి సంజయ్ కి వ్యతిరేకంగా అసమ్మతి బీజేపీ నేతలు సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే నేతలెవరూ రహస్య సమావేశాలు నిర్వహించొద్దని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.

BJP : తెలంగాణ బీజేపీలో అసమ్మతి.. ఢిల్లీకి బండి సంజయ్ సహా కీలక నేతలు

Dissent in Telangana BJP : తెలంగాణ బీజేపీలో అసమ్మతి అంశం ఢిల్లీకి చేరింది. అధ్యక్షులు బండి సంజయ్, డీకే అరుణ సహా కీలక నేతలకు ఢిల్లీకి రావాలని పిలుపు వచ్చింది. మరికాసేపట్లో తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ తో బండి సంజయ్ సహా పలువురు నేతలు భేటీ కానున్నారు. పార్టీ ఐక్యత, నేతల మధ్య సమన్వయం అంశాలపై తరుణ్ చుగ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణలో బండి సంజయ్ కి వ్యతిరేకంగా అసమ్మతి బీజేపీ నేతలు సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే నేతలెవరూ రహస్య సమావేశాలు నిర్వహించొద్దని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.

బీజేపీ నేతలు గ్రూపులుగా చీలుతున్నారు. బండి సంజయ్ పై మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, కిసాన్‌ మోర్చా జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు అసంతృప్తిగా ఉన్నారు. వరంగల్‌ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, రాజేశ్వర్‌రావు, నల్లగొండ నుంచి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, మహబూబ్‌నగర్‌లో నాగురావు నామోజీ, హైదరాబాద్‌లో వెంకటరమణి, వెంకట్‌రెడ్డి, నిజామాబాద్‌లో అల్జాపూర్‌ శ్రీనివాస్‌, మల్లారెడ్డి, ఆదిలాబాద్‌లో గోనె శ్యామ్‌ సుందర్‌రావు తదితర నేతలు బండి సంజయ్ పై అంసతృప్తిగా ఉన్నారు.

UP BJP : బీజేపీ నేత కాళ్లు మొక్కిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్

అలాగే టీఆర్ఎస్ నేతల భౌతిక దాడులపై నేతలు బీజేపీ జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఒక ఛానల్, ఒక పేపర్ పై కూడా నేతలు ఫిర్యాదు చేయనున్నారు. పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ ప్రహల్లాద్ జోషి, ఉభయ సభల కార్యదర్శులకు వినతి పత్రం అందజేయనున్నారు. టీఆర్ఎస్ కూటమి ప్లాన్ కు కౌంటర్ ఎజెండాపై కూడా చర్చ జరిపే అవకాశం ఉంది.