DK Shivakumar: 135 సీట్లు గెలిచాం.. అయినా నేను హ్యాపీగా లేను.. ఎందుకంటే?: డీకే శివకుమార్

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ శనివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

DK Shivakumar: 135 సీట్లు గెలిచాం.. అయినా నేను హ్యాపీగా లేను.. ఎందుకంటే?: డీకే శివకుమార్

DK Shivakumar

Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) గెలిచినంత మాత్రాన తానేం హ్యాపీగా లేనని డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. ఇవాళ బెంగళూరు(Bengaluru)లో ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

“మనకు అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు దక్కాయి. అయితే నాలో సంతోషం లేదు. మా ఇంటికి, సిద్ధరామయ్య ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలిపేందుకు లేదా ఇతర పనులపై రావద్దు. మన తదుపరి లక్ష్యం లోక్‌సభ ఎన్నికలు. మనం శక్తిమేరకు పోరాడాలి” అని డీకే శివకుమార్ అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపుకోసం పనిచేయాలని చెప్పారు.

పార్టీ శ్రేణులు క్షమశిక్షణతో ఉండాలని, ఈ కీలక సమయంలో సరైన వాటిపైనే దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ప్రతి ఎన్నికల్లో గెలిచేందుకు కష్టపడి పనిచేయాలని చెప్పారు. కర్ణాటకలో గెలుపు ఆరంభం మాత్రమేనని, ఈ ఒక్క విజయాన్ని చూసుకుని బద్ధకంగా కూర్చోవద్దని అన్నారు. అయిదేళ్లు సమర్థవంతంగా పరిపాలన కొనసాగించాల్సి ఉందని చెప్పారు. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ శనివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

Minister Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు.. కవిత అరెస్టు విషయంపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు