Jr NTR : సింగపూర్ మాల్‌లో చిల్ అవుతున్న ఎన్టీఆర్..

ఇటీవలే RRR సినిమాతో దేశమంతటా మెప్పించి పాన్ ఇండియా స్టార్ గా మారిన ఎన్టీఆర్ ప్రస్తుతం వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే తన...............

Jr NTR : సింగపూర్ మాల్‌లో చిల్ అవుతున్న ఎన్టీఆర్..

Jr Ntr

Jr NTR :  ఇటీవలే RRR సినిమాతో దేశమంతటా మెప్పించి పాన్ ఇండియా స్టార్ గా మారిన ఎన్టీఆర్ ప్రస్తుతం వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే తన పుట్టినరోజు నాడు తన నెక్స్ట్ రెండు సినిమాలని అనౌన్స్ చేసాడు. ఎన్టీఆర్ 30 కొరటాల శివతో, ఎన్టీఆర్ 31 ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ 30 సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ షూట్ మొదలవ్వనుంది.

Casting Couch : మేనేజర్‌ని పర్సనల్‌గా కలవాలన్నాడు.. క్యాస్టింగ్ కౌచ్‌పై గలాటా గీతూ..

ఈ షూట్ మొదలయ్యేలోపు ఎన్టీఆర్ అలా తన స్నేహితులతో కలిసి సరదాగా సింగపూర్ కి వెకేషన్ కి వెళ్ళాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ సింగపూర్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా సింగ‌పూర్‌లోని ప్ర‌ముఖ TSMBS మాల్‌లో ఎన్టీఆర్‌ సందడి చేయగా అక్కడి తెలుగు వాళ్ళు ఎన్టీఆర్ తో ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సింగపూర్ మాల్ లో చిల్ అవుతున్న ఫోటోలు, అక్కడ ఫ్యాన్స్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.