Kalyan Ram : బింబిసార పార్ట్ 2లో ఎన్టీఆర్ లేడు.. తిరుపతిలో కళ్యాణ్ రామ్ ప్రెస్ మీట్..

ఈ మీడియా సమావేశంలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ''బింబిసార కథ బాగా నచ్చింది. దర్శకుడు వశిష్ట కథ చెప్పినప్పుడు సినిమా చేయాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి జానపద సినిమాలు, సోషియో ఫాంటసీ సినిమాలు...........

Kalyan Ram : బింబిసార పార్ట్ 2లో ఎన్టీఆర్ లేడు.. తిరుపతిలో కళ్యాణ్ రామ్ ప్రెస్ మీట్..

Kalyan Ram

Bimbisara :  కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసార సినిమా ఆగస్టు 5 న రిలీజ్ అవ్వనుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇటీవలే బింబిసార సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వచ్చారు. రెండు టైంలైన్లలో జరిగే కథగా ఇది తెరకెక్కనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంది.

తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ తిరుపతిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. కళ్యాణ్ రామ్ ని బైక్ ర్యాలీతో ఆహ్వానం పలికారు నందమూరు అభిమానులు. ఈ ర్యాలీలో సీఎం ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అభిమానులు. కళ్యాణ్ రామ్ బసచేసిన హోటల్ బయట అభిమానులు భారీగా గుమిగూడారు. ర్యాలీ తర్వాత కళ్యాణ్ రామ్ మీడియా సమావేశం నిర్వహించారు.

Tapsee : హీరోయిన్స్ పై ఇప్పటికీ వివక్ష ఉంది.. నేను నిర్మాతగా ఉన్న సినిమా సెట్స్ లో అది కనిపించదు..

ఈ మీడియా సమావేశంలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ”బింబిసార కథ బాగా నచ్చింది. దర్శకుడు వశిష్ట కథ చెప్పినప్పుడు సినిమా చేయాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి జానపద సినిమాలు, సోషియో ఫాంటసీ సినిమాలు చేయాలని కోరిక ఉండేది. తాత గారి సినిమాలు చూస్తూనే పెరిగాను. బింబిసార ఓ సోషియో ఫాంటసీ మూవీ. రెండో భాగంలో జూనియర్ ఎన్టీఆర్ ఉండరు. అవన్నీ అభిమానుల ఊహాగానాలు. పార్ట్ 2 కథ ఆల్రెడీ రెడీ అయిపొయింది. బడ్జెట్ కు ఎక్కడా వెనుకాడ లేదు. అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు చేశాం. ఇంకో రెండు కొత్త సినిమాలు కూడా చేస్తున్నాను. బింబిసార పార్ట్ 2తో కూడా ఆగను. భవిష్యత్తులో మల్టీస్టారర్ సినిమాలు చేస్తాను అవకాశం వస్తే. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని మేజర్, విక్రమ్ సినిమాలు నిరూపించాయి. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది” అని తెలిపారు.