కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డు..7కోట్లకు పైగా డోసుల పంపిణీ

భారత్‌లో ఓ వైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది.

కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డు..7కోట్లకు పైగా డోసుల పంపిణీ

Over 7 Crore Coronavirus Vaccine Doses Administered In India

Over 7 crore భారత్‌లో ఓ వైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ పరంగా భారత్ మరో రికార్డును అధిగమించింది. కరోనా వ్యాక్సినేషన్​లో 7 కోట్ల డోసుల మైలురాయిని భారత్​ దాటింది. శుక్రవారం ఒక్కరోజే 12.76 లక్షల డోసుల పంపిణీతో ఈ మైలురాయిని భారత్ చేరుకుంది. శుక్రవారం రాత్రి 8గంటల నాటికి మొత్తం 7,06,18,026 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం టీకా డోసుల పంపిణీ 7,06,18,026 కాగా, తొలిడోసు తీసుకున్నవారు 6,13,56,345 మంది. అందులో ఆరోగ్య సిబ్బంది 89,03,809, కరోనా యోధులు 95,15,410 మంది ఉన్నారు. రెండో డోసు తీసుకున్నవారు 92,61,681 మంది. అందులో ఆరోగ్య సిబ్బంది 52,86,132 మంది, కరోనా యోధులు 39,75,549 మంది ఉన్నారు. తొలి డోసు తీసుకున్న 45 ఏళ్లుపైబడిన వారు 4,29,37,126 మంది ఉన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక, దేశంలో ఈ ఏడాదిలోనే అత్యధికంగా 81,466 కేసులు శుక్రవారం నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,23,03,131కు చేరింది.

కాగా, జనవరి 16 నుంచి దేశంలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియలో ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు, ఆతర్వాత ఫ్రంట్‌లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చిన విషయం తెలిసిందే. మార్చి 1నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీనిలో 60ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు.