Virupaksha: ‘విరూపాక్ష’కు బలాన్ని ఇస్తోన్న పాజిటివ్ రిపోర్ట్స్.. బాక్సాఫీస్ వద్ద చెడుగుడే!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Virupaksha: ‘విరూపాక్ష’కు బలాన్ని ఇస్తోన్న పాజిటివ్ రిపోర్ట్స్.. బాక్సాఫీస్ వద్ద చెడుగుడే!

Positive Reports For Virupaksha Increases Hype

Virupaksha: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు పూర్తి మిస్టిక్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. కాగా వేసవి కానుకగా ఈ సినిమాను ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Virupaksha : విరూపాక్ష సినిమాకి వాళ్ళు నో ఎంట్రీ..

ఇక ఈ సినిమా రషెస్ చూసిన చిత్ర యూనిట్ సభ్యులు, కొందరు సినీ ప్రముఖులు ఈ సినిమాకు పాజిటివ్ రిపో‌ర్ట్స్‌ను అందించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర టీజర్, ట్రైలర్లకు సాలిడ్ రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఇప్పుడు వస్తున్న పాజిటివ్ రిపోర్ట్స్‌తో ఈ సినిమాకు మరింత బలం చేకూరిందని చెప్పాలి. ఈ సినిమాతో తేజు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సక్సెస్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Virupaksha Trailer Launch Event : విరూపాక్ష ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..

ఈ సినిమా కథ మూఢనమ్మకాల నేపథ్యంలో వస్తుండగా, తేజు క్యారెక్టర్ ఈ సినిమాలో నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్రాన్ని బివిఎస్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్‌ను అందిస్తారో తెలియాలంటే ఏప్రిల్ 21 వరకు వెయిట్ చేయాల్సిందే.