Cooking Oils : తగ్గనున్న వంటనూనెల ధరలు
ముడి సోయా, పొద్దుతిరుగుడు నూనెల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ, వ్యవసాయ మౌలికవసతుల అభివృద్ధి సెస్ మినహాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Cooking Oil
Cooking oils : ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తరహాలో వంటనూనెలపైనా కస్టమ్స్ సుంకాలను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వంటనూనెలతో పాటు పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్ధాలపై కస్టమ్స్ సుంకాల్లో కోత విధించాలని భావిస్తోంది. కొన్ని దిగుమతులపై విధిస్తున్న వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్‌ను తగ్గించడంపైనా చర్చలు సాగిస్తోంది.
ద్రవ్య లభ్యత తగ్గడం, వడ్డీ రేట్ల పెరుగుదలతో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ద్రవ్యోల్బణానికి చెక్ పెట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై ప్రధాని కార్యాలయం, ఆర్ధిక మంత్రిత్వ శాఖలు ఇటీవల చర్చలు జరిపాయి. ముడి సోయా, పొద్దుతిరుగుడు నూనెల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ, వ్యవసాయ మౌలికవసతుల అభివృద్ధి సెస్ మినహాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Cooking Oil Prices: వంట నూనెల ధరలు తగ్గనున్నాయా? కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి..
2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఈ మినహాయింపు వర్తిస్తుందని ఆర్థికశాఖ మంగళవారం(మే24,2022) పేర్కొంది. ఈ నిర్ణయంతో వంటనూనెల ధరలు తగ్గడంతోపాటు ద్రవ్యోల్బణం కూడా అదుపులోకి వస్తుందని భావిస్తోంది.