Rs 5 Meal : ఇక ఆసుపత్రుల్లోనూ రూ.5కే ఆహారం, ఉచిత వసతి సదుపాయం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు రూ.5కే ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆసుపత్రుల పరిధిలో ఆహార పం

Rs 5 Meal : ఇక ఆసుపత్రుల్లోనూ రూ.5కే ఆహారం, ఉచిత వసతి సదుపాయం

Rs 5 Meal

Rs 5 Meal : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు రూ.5కే ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆసుపత్రుల పరిధిలో ఆహార పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం.. మొత్తం కలిపి కేవలం రూ.15కే పంపిణీ చేయనున్నారు. ‘హరే రామ హరే కృష్ణ మూవ్‌మెంట్‌’ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీంతో రోజుకు 20వేల మందికి లబ్ది చేకూరుతుందని భావిస్తున్నారు.

ఆహారంతో పాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులు బస చేసేందుకు వీలుగా వసతిగృహాలనూ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వైద్యఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ముందుగా హైదరాబాద్‌ పరిధిలోని ఆసుపత్రుల్లో ప్రారంభించి, దశల వారీగా రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులల్లోనూ ఈ వసతులను అమలు చేయనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆహార కేంద్రాలను, వసతిగృహాలను నెలకొల్పడానికి అవసరమైన స్థల పరిశీలన పూర్తయింది.

Honey : టీలో తేనె కలుపుకుంటున్నారా! ఏం జరుగుతుందో తెలుసా?

రోజుకు 20వేల మందికి లబ్ధి
ఉస్మానియా, గాంధీ, పేట్లబురుజు ప్రసూతి ఆసుపత్రి, కోఠి ఈఎన్‌టీ, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి, సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆసుపత్రి, ఛాతీ ఆసుపత్రి, మానసిక వైద్యశాలల్లోనూ నిత్యం వందల సంఖ్యలో రోగులు హాజరవుతుంటారు. వీటిల్లో నిత్యం ఓపీ సేవల్లోనే సుమారు 10వేల మందికి పైగా చికిత్స పొందుతుండగా.. వీరికి తోడుగా కనీసం ఒక్కొక్కరి చొప్పున చూసినా మరో 10వేల మంది ఆసుపత్రులకు వస్తుంటారు. అన్ని ఆసుపత్రుల్లోనూ రోగులకు ఉచిత ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. అయితే, వారి వెంట వచ్చిన సహాయకులు మాత్రం ఆసుపత్రి బయట సొంత డబ్బుతో తింటున్నారు. ఇందుకు ఒక్కో సహాయకుడికి రోజుకు కనీసం రూ.200 ఖర్చవుతోంది. వారం రోజుల పాటు రోగి ఆసుపత్రిలో ఉంటే.. సహాయకుడికి అయ్యే ఖర్చు సుమారు రూ.1,400 దాటుతోంది. ఓపీలో వైద్యసేవలకు వచ్చిన రోగులూ, వారి సహాయకులది ఇదే పరిస్థితి.

ప్రభుత్వ తాజా నిర్ణయంతో రోగులకు, వారి సహాయకులకు శుచి, శుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారం నామమాత్రపు ధరలకే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం హరే కృష్ణ సంస్థ జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 150 ఆహార కేంద్రాల ద్వారా రోజుకు సుమారు 50వేల మందికి భోజనాలను పంపిణీ చేస్తోంది. ఒక్కో భోజనానికి కేవలం రూ.5 వసూలు చేస్తోంది. ఇదే తరహాలో ఆసుపత్రుల్లోనూ అల్పాహారానికి, మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు ఒక్కో దానికి కేవలం రూ.5 చొప్పున వసూలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు ప్రత్యేకంగా వసతి గృహాలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో.. దీనికి సంబంధించిన ఏర్పాట్లను వైద్యఆరోగ్యశాఖ చేపట్టింది. ఇక నుంచి కొత్తగా నిర్మించనున్న ఆసుపత్రులకు అనుబంధంగా సహాయకుల కోసం ప్రత్యేక భవనాల నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతమున్న ఆసుపత్రుల్లో ఈ తరహాలో నూతన నిర్మాణాలు వెంటనే సాధ్యం కాదు గనుక.. అందుబాటులో ఉన్న భవనాల్లోనే పురుషులు, మహిళలకు వేర్వేరు వసతి ఏర్పాట్లు చేయనున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లను, స్నానాల గదులనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. దసరా నాటికే ఆహార కేంద్రాలు, వసతిగృహాలను అందుబాటులోకి తీసుకురావాలని అనుకున్నా, మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

Home Pollution : ముప్పుగా మారబోతున్న ఇంటి కాలుష్యం

ఆకలితో అలమటించే వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టాలన్న సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ‘అన్నపూర్ణ’ కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. నిరాశ్రయులు, చిరు వ్యాపారులు, బీద వారికి అన్నపూర్ణ సెంటర్ల ద్వారా ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నారు. శుచి, శుభ్రతకు, రుచికరమైన భోజనానికి పెట్టింది పేరుగా అన్నపూర్ణ కేంద్రాలు మారాయి. ఒక్కో భోజనం ఖర్చుకు రూ.27.50 అవుతుండగా, జీహెచ్‌ఎంసీ రూ.22.50 భరిస్తోంది.