T20 World Cup: మెంటార్‌గా ఉంటున్నందుకు ధోనీ పైసా తీసుకోవడం లేదు – జై షా

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సెక్రటరీ జై షా మాట్లాడుతూ.. ఎంఎస్ ధోనీ టీమిండియాకు మెంటార్ గా వ్యవహరిస్తున్నందుకు పైసా కూడా తీసుకోవడం లేదని అన్నారు.

T20 World Cup: మెంటార్‌గా ఉంటున్నందుకు ధోనీ పైసా తీసుకోవడం లేదు – జై షా

Ms Dhoni

T20 World Cup: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సెక్రటరీ జై షా మాట్లాడుతూ.. ఎంఎస్ ధోనీ టీమిండియాకు మెంటార్ గా వ్యవహరిస్తున్నందుకు పైసా కూడా తీసుకోవడం లేదని అన్నారు. చివరిసారిగా జరిగిన ఇంటర్నేషనల్ మెగా ఈవెంట్ వన్డే వరల్డ్ కప్ 2020తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఆ తర్వాత జరుగుతున్న వరల్డ్ కప్ ఈవెంట్ మళ్లీ ఇదే.

అక్టోబర్ 1 నుంచి యూఏఈలోని ఒమన్ వేదికగా ఆరంభం కానుంది. ఈ మాజీ కెప్టెన్ దీనికి మెంటార్ గా వ్యవహరిస్తుండగా ఎంఎస్ ధోనీ సేవలందుకోవడం బీసీసీఐ గొప్పతనంగా భావిస్తుంది. కేవలం టీ20 వరల్డ్ కప్ కోసం మాత్రమే ధోనీ ఈ బాధ్యతలు తీసుకుంటున్నారు.

‘ఎంఎస్ ధోనీ ఇలా వ్యవహరిస్తున్నందుకు ఎలాంటి లబ్ధి పొందడం లేదు’ అని జై షా అన్నారు. ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీని సంప్రదించి, ఆ తర్వాత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు తెలియజేసిన తర్వాతనే జైషా ఈ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించారు. టీ20 వరల్డ్ కప్ ఈవెంట్ లో టీమిండియా అక్టోబర్ 24న తొలి మ్యాచ్ ఆడనుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టుపై ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది.

……………………………………… : మర్మాంగాలు కోసేయాలి, అప్పుడే భయం వస్తుంది

టీ20 వరల్డ్ కప్ అరంగ్రేట్ సీజన్ లో 2007వ సంవత్సరం మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా వ్యవహరించారు. ఆగష్టు 2020లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కు మాత్రమే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.