CM KCR : సోషల్ మీడియా కాదు.. క్షుద్ర విద్య.. విరిచి పొయ్యిలో పెడతాం : సీఎం కేసీఆర్

దేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ కాదా అని అన్నారు. తెలంగాణలో, హైదరాబాద్ లో మంచి ఏకో ఉందని.. ఫలితంగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.

CM KCR : సోషల్ మీడియా కాదు.. క్షుద్ర విద్య.. విరిచి పొయ్యిలో పెడతాం : సీఎం కేసీఆర్

Kcr

CM KCR criticized : దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అని సీఎం కేసీఆర్ విమర్శించారు. దేశ వాతావరణాన్ని చెడగొడుతుందన్నారు. మీరు మొరిగితే మిమ్మల్ని పిచ్చి కుక్కలు అంటామని తెలిపారు. రాష్ట్రాన్ని చెడగొడతా మంటే ఊరుకోవాలా అని అన్నారు. సోషల్ మీడియా పేరుతో తప్పుడు ప్రచారాలను చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. దళిత బంధు పథకం మీకు కనపడటం లేదా అని నిలదీశారు.

దేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ కాదా అని అన్నారు. తెలంగాణలో, హైదరాబాద్ లో మంచి ఏకో ఉందని.. ఫలితంగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. మీరు సొల్లు పురాణం సోషల్ మీడియా పేరుతో తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోవాల్నా అని అన్నారు. సోషల్ మీడియా కాదు.. క్షుద్ర విద్య.. విరిచి పొయ్యిలో పెడతామని హెచ్చరించారు.

CM KCR : నదుల అనుసంధానం మిలీనియానికే బిగ్ జోక్ : సీఎం కేసీఆర్

హైదరాబాద్ కు ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే మోదీకి నిద్ర పట్టట్లేదన్నారు. ఆర్బిట్రేషన్ సెంటర్ అహ్మదాబాద్ లో పెట్టాలని మోదీ ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఎందుకు..అహ్మదాబాద్ లో పెట్టాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. హైదరాబాద్ ఆర్బిట్రేషన్ సెంటర్ కు గుజరాత్ లో శిఖండిని తెచ్చారని పేర్కొన్నారు. మోడీ దేశానికి ప్రధాని కాదు..గుజరాత్ కే ప్రధాని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించి..ఇంకోటి గుజరాత్ లో పెట్టుకుంటే బాగుండేదన్నారు.