KTR To Bandi : రాజీనామాకు సిద్ధమా? బండి సంజయ్ కు కేటీఆర్ సవాల్..

తెలంగాణ పథకాలకు నిధులు కేంద్రమే ఇస్తోందని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను..రుజువు చేయకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? అంటూ కేటీఆర్ బండి సంజయ్ కు సవాల్ విసిరారు

KTR To Bandi : రాజీనామాకు సిద్ధమా? బండి సంజయ్ కు కేటీఆర్ సవాల్..

Ktr Tobundy Sanjay

KTR  Challenge To Bandi Sanjay : తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు నేతలు. ఈ క్రమంలో బీజేపీ తెలంగాణ చీఫ్..ఎంపీ బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.తెలంగాణలో పథకాలకు నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని బండి సంజయ్ అన్న మాటలకు మంత్రి కేటీఆర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. తెలంగాణ‌ పథకాలకు కేంద్రం నిధులు ఇచ్చింద‌ని రుజువు చేస్తే నేను మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తా..రుజువు చేయ‌క‌పోతే ఎంపీ ప‌ద‌వికి మారు రాజీనామా చేస్తారా? అని కేటీఆర్ బండి సంజయ్ కు సవాల్ విసిరారు.

Read more : Pragathi Bhavan : 27న దళితబంధుపై కేసీఆర్ సమీక్ష

హుజూరాబాద్ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా సాగుతున్న అధికార టీఆర్ఎస్‌, విప‌క్ష బీజేపీలు స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్లు విసురుకుంటున్నాయి. టీఆర్ఎస్ నేత‌లు, ఇటు బీజేపీని ఇటు మాజీ మంత్రి ..ప్రస్తుత బీజేపీ నేత అయిన ఈటలపై పలు విమర్శలు చేస్తున్నారు. ఇలా ఇరు పార్టీల మధ్యా నేత‌లు మాట‌ల తూటాలు విసురుకుంటున్నారు. ఈక్రమంలో ఈ పరిస్థితి మరింత హీటెక్కింది. కేటీఆర్‌ బండి సంజయ్ కు విసిరిన సవాలుతో తెలంగాణ రాజ‌కీయాల్లో ఒక్క‌సారిగా వేడి పెంచేశారనే చెప్పాలి. తెలంగాణ‌కు కేంద్రం విడుద‌ల చేసిన నిధుల విష‌యాన్ని ప్ర‌స్తావించిన సంద‌ర్భంగా కేటీఆర్ సంధించిన ఈ స‌వాల్ కు బండి సంజ‌య్ ఎలా స్పందిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Read more : Harish Rao : ఇచ్చేది మేము.. ఊడగొట్టేది బీజేపీ

కాగా మంగ‌ళ‌వారం (సెప్టెంబర్ 14,2021) జోగులాంబ గ‌ద్వాల్ జిల్లాలో ప‌ర్య‌టించిన మంత్రి కేటీఆర్ ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ బీజేపీ నేత‌లపై విరుచుకుప‌డ్డారు. తెలంగాణలో అభివృద్ది గానీ..నిధుల విషయంలో గానీ అంశం ఏదైనా సరే చ‌ర్చ‌కు తాను సిద్ద‌ంగా ఉన్నామని మరి మాపై విమర్శలు చేస్తూ..ఆరోపణలు చేస్తున్న బండి సంజ‌య్ సిద్ధ‌ంగా ఉన్నారా? అంటూ సవాల్ విసిరారు.

ఈ సందర్భంగా బీజేపీపై విరుచుకుపడిన కేటీఆర్ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ కేంద్రానికి రూపాయి ఇస్తే.. తెలంగాణ‌కు కేంద్రం ఇచ్చింది మాత్రం బారాణ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.కేంద్రం నుంచి అద‌నంగా తెలంగాణకు నిధులు వ‌చ్చాయ‌ని నిరూపిస్తే.. మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తా. మ‌రి నిరూపించ‌లేక‌పోతే బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తారా? అంటూ బండిపై కేటీఆర్ ఓ రేంజ్ లో విరుచుకుప‌డ్డారు.