Pragathi Bhavan : 27న దళితబంధుపై కేసీఆర్ సమీక్ష

సీఎం కేసీఆర్ ఈ నెల 27 తేదీన దళితబంధు పథకంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలు నాలుగు జిల్లాలకు చెందిన మంత్రులు హాజరు కానున్నారు.

Pragathi Bhavan : 27న దళితబంధుపై కేసీఆర్ సమీక్ష

Pragathi Bhavan

Pragathi Bhavan : తెలంగాణ సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 27న దళితబంధుపై ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు. జిల్లా పరిషత్ చైర్మన్లు, కలెక్టర్లు, మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, జుక్కల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

మొదట హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకం అమలు చేయగా.. తాజాగా మరో నాలుగు మండలాల్లో అమలు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలను ఎంపిక చేశారు. ఆ మండలాల్లోని అన్ని దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు అందించనున్నారు.

దళిత బంధు అమలు కానున్న మండలాలు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గం నిజాం సాగర్ మండలం.