TRSLP Meeting : బీజేపీపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. పార్టీ నేతలకు దిశా, నిర్దేశం

బీజేపీపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో సమస్యలే లేనట్లు బీజేపీ ప్రవర్తిస్తోందంటూ మండిపడ్డారు. జాతీయ అంశాలను తప్పుదోవపట్టించేందుకు బీజేపీ...

TRSLP Meeting : బీజేపీపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. పార్టీ నేతలకు దిశా, నిర్దేశం

Kcr Delhi

CM KCR Serious Comments : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రధానంగా వరి ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేంద్ర అనుసరిస్తున్న వైఖరిని ఆయన తూర్పారబడుతున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆయన కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా 2022, మార్చి 21వ తేదీ సోమవారం ఉదయం టీఆర్ఎస్ ఎల్పీ (TRSLP) సమావేశం నిర్వహించారు.

Read More : వరి రాజకీయం.. ఢిల్లీకి సీఎం కేసీఆర్..!

అందులో బీజేపీపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో సమస్యలే లేనట్లు బీజేపీ ప్రవర్తిస్తోందంటూ మండిపడ్డారు. జాతీయ అంశాలను తప్పుదోవపట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న కేసీఆర్.. కమలం పార్టీ ట్రాప్‌లో పడొద్దంటూ గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశవ్యాప్తంగా వివాదం సృష్టించాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. టీఆర్ఎస్ఎల్పీ భేటీలో అనేక అంశాలను ప్రస్తావించన కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా రైతు ఉద్యమాన్ని చేయాలని నిర్ణయించారు.

Read More : CM KCR: ప్యాడీ పాలిటిక్స్.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్..!

ఎల్పీ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు అయ్యారు. సమావేశంలో పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. కేంద్రంపై చేయాల్సిన పోరాటం, నిరసన కార్యక్రమాలపై వివరించారు. టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం తరువాత ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. తెలంగాణలో యాసంగి వరికోతలు మొదలయ్యాయి. తిండిగింజలు, సొంత అవసరాలు, మిల్లర్లతో ఒప్పందాలు చేసుకున్నవి గాక.. 45 లక్షల టన్నుల నుంచి 50 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని ప్రభుత్వ అంచనా. వానాకాలం ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో సై అంటూ నిరసనలు చేపట్టిన టీఆర్‌ఎస్‌.. యాసంగి ధాన్యం కొనుగోళ్లపైనా బీజేపీని ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది.