Opened Fire : ఒకరిపై మరొకరు కాల్పులు జరుపుకున్న సీఆర్పీఎఫ్ జవాన్లు.. ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం

ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఒకరిపై మరొకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో ఒక జవాను మృతి చెందారు.

Opened Fire : ఒకరిపై మరొకరు కాల్పులు జరుపుకున్న సీఆర్పీఎఫ్ జవాన్లు.. ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం

Drug (1)

Two soldiers of A 39 battalion opened fire : ములుగు జిల్లాలోని వెంకటాపురంలోని సీఆర్పీఎఫ్‌ ఏ39 బెటాలియన్ బేస్‌ క్యాంప్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఒకరిపై మరొకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో ఒక సీఆర్పీఎఫ్ జవాను మృతి చెందారు. టిఫిన్‌ విషయంలో జరిగిన చిన్న గొడవ.. కాల్పులకు దారితీసింది. ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్‌ ఎస్సై మృతి చెందారు. ఎస్సైపై కాల్పులు జరిపిన జవాన్‌ తనను చంపేస్తారన్న భయంతో.. తనను తాను గన్‌తో కాల్చుకున్నాడు.

సీఆర్పీఎఫ్ జవాన్లు ఎస్ఐ ఉమేష్ చంద్ర, స్టీఫెన్ ఒకరిపై మరొకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పుల్లో బీహార్ కు చెందిన ఎస్ఐ ఉమేష్ చంద్ర మృతి చెందారు. మరొక జవాను స్టీఫెన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ కాల్పుల్లో తొలుత ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో విలవిలలాడుతున్న ఆ ఇద్దరిని సీఆర్ పీఎఫ్ అధికారులు చికిత్స కోసం ఏటూరునాగారం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలించిన కాసేపటికే.. ఉమేష్ చంద్ర మృతి చెందారు. వైద్యులు స్టీఫెన్ కు చికిత్స అందిస్తున్నారు.

 

Omicron In India : దేశంలో 422కు చేరిన ఒమిక్రాన్ కేసులు

సీఆర్పీఎఫ్ A 39 బెటాలియన్‌ జవాన్లు.. ములుగు జిల్లాలో కొన్ని రోజులుగా మావోయిస్టుల కోసం కూంబింగ్‌ చేస్తున్నారు. ఇవాళ ఉదయం కూంబింగ్ నుంచి వచ్చిన బెటాలియన్‌లోని అధికారులు, జవాన్లు.. టిఫిన్ల కోసం లైన్‌లో నిల్చున్న సమయంలో మెస్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న జవాన్ స్టీఫెన్‌ వడ్డిస్తున్నాడు. అదే సమయంలో టిఫిన్ ఎక్కువ పెట్టాలని.. త్వరగా పెట్టాలనే డిమాండ్లతో తీవ్ర ఒత్తిడికి గురైన స్టీఫెన్‌ ఒక్కసారిగా కోపోద్రిక్తుడై వాదనకు దిగాడు.

ఆ కోపంలోనే ఎస్సై ఉమేష్‌చంద్రపై కాల్పులు జరిపాడు. దీంతో ఉమేష్‌చంద్ర ఎదురు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల నుంచి స్టీఫెన్‌ తప్పించుకున్నాడు. తీవ్రంగా గాయపడ్డ ఉమేష్‌చంద్ర.. ఘటనాస్థలిలోనే కుప్పకూలిపోవడంతో అతన్ని హుటాహూటిన ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

Corona In France : ఫ్రాన్స్ లో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే లక్ష కేసులు నమోదు

అయితే ఉమేష్‌ చంద్రపై కాల్పులు జరిపిన స్టీఫెన్‌.. తనను తోటి జవాన్లు చంపేస్తారన్న భయంతో తనకు తాను గన్‌తో కాల్చుకున్నాడు. తీవ్ర గాయాలతో విలవిల్లాడుతున్న స్టీఫెన్‌ను ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు.

కాల్పుల ఘటనపై వెంకటాపురం సీఆర్పీఎఫ్‌ బెటాలియన్‌ ఇంఛార్జి ఎంక్వైరీ వేశారు. విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఘటనాస్థలిని ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పరిశీలించారు. కాల్పులకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.