Kishan Reddy: కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. గవర్నర్, కేసీఆర్ మధ్య గ్యాప్‌కు కారణమెవరో చెప్పిన కేంద్ర మంత్రి

కొద్దిరోజులుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్‌కు మధ్య మాటలు లేవనే వార్త విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో గవర్నర్ వర్సెస్ తెరాస నేతల మధ్య అడపాదడపా మాటల యుద్ధం సాగుతోంది...

Kishan Reddy: కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. గవర్నర్, కేసీఆర్ మధ్య గ్యాప్‌కు కారణమెవరో చెప్పిన కేంద్ర మంత్రి

Kishan Reddy

Kishan Reddy: కొద్దిరోజులుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్‌కు మధ్య మాటలు లేవనే వార్త విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో గవర్నర్ వర్సెస్ తెరాస నేతల మధ్య అడపాదడపా మాటల యుద్ధం సాగుతోంది. ఇంతకీ గవర్నర్, సీఎంకు మధ్య మాటలు లేకపోవడానికి కారణమేమిటా అనే ప్రశ్న తెలంగాణలో రాజకీయ పరిజ్ఞానం కలిగిన వారిలో వ్యక్తమవుతుంది. అయితే ఆ ప్రశ్నలకు సమాధానం దొరికేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వరంగల్ పర్యటనలో ఉన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ వల్లనే గవర్నర్, కేసీఆర్‌కు మధ్య మాటల్లేవని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kishan Reddy With Corporators : జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు కేంద్రమంత్రి క్లాస్

హుజూరాబాద్ ఎన్నికల కోసం ఓ వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం వల్లే గవర్నర్ పై కేసీఆర్‌కు కోపం వచ్చిందని అన్నారు. అందుకే గవర్నర్‌ను తరచూ అవమానిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు గవర్నర్ వస్తే కలెక్టర్, ఎస్పీ లేకపోవటం అవమానకరం అని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు దశల వారీగా వస్తాయని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, తెరాస ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Kishan Reddy: వడ్లకు సంచుల్లేవ్.. తండ్రీ కొడుకులు తట్టలో తీసుకొస్తారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రాజ్యాంగంపై ప్రమాణం చేసిన కేసీఆర్, కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ సమాజం అంతా గమనిస్తోందని, బీజేపీని తిట్టాలని టీఆర్ఎస్ అధిష్టానం ప్రోత్సహిస్తోందని, కేసీఆర్ మెప్పుకోసం తెరాస నేతలు దిగజారి మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని అన్నారు. కరోనాను జయించే దిశగా భారత్ ఉందని అన్నారు. రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా 112 వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై ప్రధాని దృష్టిలో పెట్టామన్నారు. ఘంటసాల శతాబ్ధి ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోతోందని, జులై 14న అల్లూరి 125వ జయంతి సందర్భంగా ఏపీలో ఘనంగా నిర్వహిస్తామని, దీనికి ప్రధాని కూడా హాజరవుతారని అన్నారు. ఆగస్టు 15న 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహస్తామని, ఆ రోజు దేశవ్యాప్తంగా ప్రతీ ఇంటా జాతీయ పతాకం ఎగరాలని, జాతీయ గీతం ఆలపించాలని కిషన్ రెడ్డి కోరారు.