Acharya: ఓటీటీలోకి ఆచార్య.. ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి సబ్జెక్ట్‌తో రాబోతుందా...

Acharya: ఓటీటీలోకి ఆచార్య.. ఎప్పుడంటే?

Acharya To Release In Ott At This Time

Acharya: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి సబ్జెక్ట్‌తో రాబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక పక్కా యాక్షన్ డ్రామా మూవీగా ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు ఈ మెగా మూవీని చూసేందుకు థియేటర్లకు ఎగబడుతున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా మెగా ఫ్యాన్స్‌కు ట్రీట్ అని వారు అంటున్నారు.

Acharya: ఆచార్య ఆగయా.. ఓన్లీ తెలుగులోనే వర్కౌట్ అవుతుందా?

ఇప్పటికే థియేటర్ల వ్దద ఈ సినిమా చూసేందుకు జనం బారులు తీరుతున్నారు. ఫస్ట్ షోకే మంచి టాక్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపడం ఖాయమని అంటున్నారు. చిరు, చరణ్ కలిసి చేసిన సీన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమా థియేటర్లలో జాతరను తలపిస్తుంటే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి అప్పుడే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ రిలీజ్‌కు సంబంధించి డీల్ కుదుర్చుకుంది.

Acharya: ఆచార్య ప్రీమియర్ షో టాక్.. ఆడియన్స్ ఏమంటున్నారంటే?

ఈ లెక్కన ఆచార్య థియేటర్లలో రిలీజ్ అయిన కనీసం 25 రోజుల తరువాతే ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు వీలుంటుంది. అంటే ఈ సినిమా మే చివరినాటికి ఓటీటీలో కనిపించడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి నిజంగానే ఆచార్య సినిమాను థియేటర్లలో చూడలేనివారు, ఇలా ఓటీటీలో చూసి సంతోషించడం ఖాయమని తెలుస్తోంది. అటు అమెజాన్ ప్రైమ్ వారు ఆచార్య ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.