Naveen Chandra : కలర్స్‌ స్వాతితో పెళ్లి.. నిజం చెప్పిన హీరో నవీన్ చంద్ర..

గ‌తంలో న‌వీన్ చంద్ర‌, స్వాతిలు పెళ్లి చేసుకున్నారు అంటూ వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై ఓ ఇంట‌ర్వ్యూలో హీరో న‌వీన్ చంద్ర స్పందించాడు.

Naveen Chandra : కలర్స్‌ స్వాతితో పెళ్లి.. నిజం చెప్పిన హీరో నవీన్ చంద్ర..

Naveen Chandra- Colours Swathi

Naveen Chandra- Colours Swathi : న‌వీన్ చంద్ర హీరోగా న‌టిస్తున్న సినిమా మంత్‌ ఆఫ్‌ మధు (Month Of Madhu). శ్రీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో క‌ల‌ర్స్ స్వాతి (Colours Swathi) హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌ల ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో చిత్ర బృందం పాల్గొంటోంది. కాగా.. గ‌తంలో న‌వీన్ చంద్ర‌, స్వాతిలు పెళ్లి చేసుకున్నారు అంటూ వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై ఓ ఇంట‌ర్వ్యూలో హీరో న‌వీన్ చంద్ర స్పందించాడు. ఆ రూమ‌ర్లు రావ‌డానికి గ‌ల కార‌ణాల‌ను చెప్పారు.

“త్రిపుర సినిమా కోసం తొలిసారి స్వాతితో క‌లిసి ప‌ని చేశాను. ఆమె చాలా మంది వ్య‌క్తి. ఇక ఇరు కుటుంబాల మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. త్రిపుర సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చిత్ర‌బృందం మొద‌టిసారి ఓ ఫోటోను విడుద‌ల చేసింది. ఆ ఫోటోలో నేను, స్వాతి పెళ్లి బ‌ట్ట‌ల్లో క‌నిపిస్తాం. ఆ ఫోటో వైర‌ల్‌గా మారింది. దాన్ని చూసిన చాలా మంది నిజంగా మేమిద్దం పెళ్లి చేసుకున్నాం అని భావించారు. కొంద‌రు నాకు ఫోన్ చేసి మీరు స్వాతిని పెళ్లి చేసుకున్నారా..? అని న‌న్ను అడిగారు. అయితే.. నేను, స్వాతి వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కొద్ది రోజుల త‌రువాత చిత్ర‌బృందం అదే ఫోటోని పోస్ట‌ర్‌గా విడుద‌ల చేసింది. అప్పుడు అంద‌రికీ క్లారిటీ వ‌చ్చింది.” అని న‌వీన్ చంద్ర చెప్పారు.

Jawan : ఆ రికార్డు సాధించిన మొదటి హీరోగా షారుఖ్ ఖాన్.. జవాన్ మూవీ..

ఇక‌.. ‘మంత్ ఆఫ్ మ‌ధు’ చిత్రం గురించి మాట్లాడుతూ.. ఇదొక‌ ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కింద‌న్నారు. ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య ఉండాల్సిన అనుబంధం గురించి ఈ చిత్రం తెలియ‌జేస్తుంద‌ని చెప్పారు. ఈ చిత్రం అక్టోబ‌ర్ 6న రిలీజ్ కానుంద‌ని, ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌న్నారు.