Megamsh Srihari : శ్రీహరి కొడుకు మేఘాంశ్ కొత్త సినిమాని లాంచ్ చేసిన మంచు మనోజ్.. మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?

టాలీవుడ్ రియల్ స్టార్ శ్రీహరి (Srihari) కొడుకు మేఘాంశ్ (Megamsh Srihari) తన కొత్త సినిమాని నేడు మంచు మనోజ్ (Manchu Manoj) చేతులు మీదగా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.

Megamsh Srihari : శ్రీహరి కొడుకు మేఘాంశ్ కొత్త సినిమాని లాంచ్ చేసిన మంచు మనోజ్.. మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?

Megamsh Srihari new movie launched by Manchu Manoj

Megamsh Srihari : టాలీవుడ్ రియల్ స్టార్ శ్రీహరి (Srihari) కొడుకు మేఘాంశ్ (Megamsh Srihari) 2019లో వెండితెరకి హీరోగా పరిచమయ్యాడు. ‘రాజ్‌దూత్’ అనే యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత దాదాపు 4 ఏళ్ళ గ్యాప్ తీసుకోని తన కొత్త మూవీ అనౌన్స్ చేశాడు. ఈ సినిమా ఇవాళ (మార్చి 27) హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ ఈవెంట్ కి మంచు మనోజ్ (Manchu Manoj), బాబీ కొల్లి (K Bobby), చోటా కె నాయుడు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

RRR : ఆస్కార్‌కి ఎన్టీఆర్, చరణ్‌కి ఆహ్వానం వచ్చింది.. రాజమౌళి టికెట్ కొనుకొని వెళ్ళాడు.. రాజమౌళి కొడుకు కార్తికేయ!

ఈ మూవీ టైటిల్ పోస్టర్ ని మంచు మనోజ్, బాబీ కొల్లి , చోటా కె నాయుడు లాంచ్ చేశారు. ‘మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?’ అనే డిఫరెంట్ టైటిల్ ని పెట్టుకున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు భవానీ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. రియా సచ్‌దేవ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. హీరో హీరోయిన్ల పై మంచు మనోజ్ క్లాప్ కొట్టగా, చోటా కె నాయుడు కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బాబీ కొల్లి గౌరవ దర్శకత్వం వహించాడు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్ర యూనిట్ కు శుభాశిస్సులు తెలియజేశాడు.

RRR : ఆస్కార్ క్యాంపైన్ కోసం అంత ఖర్చు చేసాం.. రాజమౌళి కొడుకు కార్తికేయ!

A2 పిక్చర్స్ బ్యానర్ పై సంధ్యా రాణి, స్వరూప రాణి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. సునీల్, హర్ష వర్ధన్, పోసాని కృష్ణ మురళి, శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు సుదర్శన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ లో మేఘాంశ్ మాట్లాడుతూ.. మమ్మల్ని బ్లెస్ చేయడానికి ఈ ఈవెంట్ కి వచ్చిన మంత్రి తలసాని గారికి, మనోజ్ అన్నకి, బాబీ అన్నకి, చోటా గారికి హృదయపూర్వ కృతజ్ఞతలు అంటూ తెలియజేశాడు.