SVC 50 : రామ్ చరణ్ – శంకర్ ఫిల్మ్ పోస్టర్..నల్ల కోటు వేసుకుని

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ - ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.

SVC 50 : రామ్ చరణ్ – శంకర్ ఫిల్మ్ పోస్టర్..నల్ల కోటు వేసుకుని

Ramcharan

Ram Charan And Shankar : టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ – ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. 2021, సెప్టెంబర్ 08వ తేదీ బుధవారం హైదరాబాద్ లో జరిగాయి. ఈ విషయాన్న చిత్ర యూనిట్ తెలియచేస్తూ..ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

Read More : Indonesia : ఇండోనేషియాలోని జైలులో అగ్నిప్రమాదం…41 మంది ఖైదీలు సజీవదహనం

Dil Raju

ఇందులో శంకర్, రామ్ చరణ్, కియారా, దిల్ రాజు, సునీల్, ఇతర నటీనటులు ఉన్నారు. వీరంతా…నల్ల కోటు వేసుకుని..చేతుల్లో ఏవో బుక్స్, ఫైల్స్ పట్టుకుని ముందుకు నడుస్తున్నట్లుగా ఉంది. వీరి వెనుక చాలా మంది ఉన్నట్లు పోస్టర్ లో చూపించారు. ఈ పోస్టర్ ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. రామ్ చరణ్ కు సంబంధించిన సినిమా పోస్టర్ రిలీజ్ కావడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More : Nivetha Thomas : పాలు పితికిన నివేదా థామస్, వీడియో వైరల్

ఇటీవలే శంకర్‌తో సినిమా అనౌన్స్ చేసి మెగా ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇచ్చాడు చరణ్. చెర్రీ ప్రస్తుతం క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా పూర్తిచేసి తండ్రి మెగాస్టార్ తో కలిసి ‘ఆచార్య’ సినిమా బ్యాలెన్స్ పూర్తి చేస్తున్నాడు. దీంతో పాటే సౌత్ స్టార్ దర్శకుడు శంకర్ తో కలిసి మరో క్రేజీ పాన్ ఇండియా సినిమాకు రెడీ అయిపోయాడు. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీకి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తున్నారు. సునీల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. సంగీత దర్శకుడిగా థమన్ ను ఇప్పటికే ఎంచుకున్నారు.