Naeem Diaries: రివ్యూ-క్రిమినల్ బయోపిక్ ‘నయీం డైరీస్’

బాలీవుడ్ టూ టాలీవుడ్ ఎక్కడ చూసినా ఇప్పుడు సినిమా పరిశ్రమలో బయోపిక్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటు సినిమా సెలబ్రిటీల నుండి..

Naeem Diaries: రివ్యూ-క్రిమినల్ బయోపిక్ ‘నయీం డైరీస్’

Naeem Diaries

నటీనటులు.. వశిష్ట సింహ, యజ్ఞ శెట్టి, దివి, బాహుబలి నిఖిల్‌, శశి కుమార్‌, జబర్దస్త్‌ ఫణి తదితరులు

సాంకేతిక నిపుణులు.. సినిమాటోగ్రఫీ : సురేష్‌ భార్గవ్‌, సంగీతం : అరుణ్‌ ప్రభాకర్‌, ఎడిటర్‌ : కిషోర్‌ మద్దాలి, పీఆర్వో : జియస్‌కె మీడియా, నిర్మాత : సీఏ వరదరాజు, రచన, దర్శకత్వం : దాము బాలాజీ

బాలీవుడ్ టూ టాలీవుడ్ ఎక్కడ చూసినా ఇప్పుడు సినిమా పరిశ్రమలో బయోపిక్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటు సినిమా సెలబ్రిటీల నుండి స్పోర్ట్స్ తో పాటు వివిధ రంగాలలో గొప్పగొప్ప వాళ్ళ జీవిత కథల ఆధారంగా ఈ బయోపిక్స్ తెరకెక్కిస్తున్నారు. అయితే.. బయోపిక్స్ అంటే గొప్ప వాళ్ళ కథలే కావాలా.. ఏం క్రిమినల్స్ జీవితాలతో కూడా బయోపిక్స్ చేయకూడదా అన్నట్లుగా ఓ క్రిమినల్ జీవితం ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కింది. సహజంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇలాంటి క్రైమ్ కథలతో సినిమాలు చేస్తుంటాడు. కానీ దాము బాలాజీ అనే కొత్త దర్శకుడు కూడా ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేశాడు. మరి ఈ క్రిమినల్ బయోపిక్ ఎలా ఉందో చూద్దాం..

RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ ట్రైన్‌లో 3000 మంది అభిమానులు

కథేంటంటే..
నయీం (వశిష్ట సింహా) ఆవేశపరుడైన వ్యక్తి. త్వరగా రియాక్ట్ అయ్యే తత్వం గలవాడు. దూకుడు స్వభావంతో ప్రవర్తిస్తుంటాడు. బయట ఎలా ఉన్నా, అతనికి కుటుంబం అంటే చాలా ప్రేమ. ముఖ్యంగా సోదరి (యజ్ఞశెట్టి) అంటే చాలా ఇష్టం. విప్లవానికి ఆకర్షితుడైన నయీం నక్సల్స్ ఉద్యమంలో చేరుతాడు. ఫేక్ ఎన్ కౌంటర్ సందర్భంగా పోలీసులకు పట్టుబడతాడు. పట్టుబడిన నయీం, ఇతర నక్సలైట్ నాయకులకు జైలు శిక్ష పడుతుంది. నయీం సోదరిపై అత్యాచార యత్నం చేసిన వ్యక్తికి నక్సల్స్ చిన్న శిక్ష విధించి వదిలేయడం నయీం, అతని సోదరుడి వలీకి నచ్చదు. జైల్లో ఉన్న నయీం సోదరుడు వలీ సహాయంతో తన సోదరిపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని చంపిస్తాడు. దీంతో పార్టీ గీత దాటినందుకు నయీంను నక్సలైట్లు కమిటీ నుంచి బహిష్కరిస్తారు. ఈ హత్య కేసులో నయీం సోదరిపై పోలీసు ఆఫీసర్ (శశి కుమార్) ఒత్తిడి తీసుకొస్తారు. ఇంతలో వలీ హత్య జరుగుతుంది. సోదరుడిని చంపింది నక్సలైట్ ప్రోద్బలంతోనేనని తెలుసుకుంటాడు నయీం. సోదరిపై పోలీసులు పెడుతున్న ఒత్తిడి, తమ్ముడి హత్యతో నక్సలైట్ల ఏరివేతలో పోలీసులకు సహకరించేందుకు నయీం ఒప్పుకుంటాడు. ఉద్యమకారిని, తన ప్రేయసి అయిన లత (సంయుక్త) సహకారం కోరతాడు. నక్సలైట్ ఉద్యమాన్ని ప్రాణంగా ప్రేమించిన నయీం, ఆ నక్సలైట్ల ఎన్ కౌంటర్ లకు ఎలా సారథ్యం వహించాడు. పోలీసు, రాజకీయ వ్యవస్థలు, కుటుంబ ప్రేమ అతన్ని ఎలా క్రూరమైన నేరస్తుడిగా మార్చాయి అనేది మిగిలిన కథ.

Bigg Boss 5 : స్టెప్పులతో దద్దరిల్లిన బిగ్‌బాస్‌ హౌస్

ఎలా ఉందంటే…
నయీం డైరీస్ సినిమా కోసం దర్శకుడు దాము బాలాజీ చాలా రీసెర్చ్ చేసినట్లు సినిమా చూస్తే తెలుస్తుంది. ప్రతి పాత్ర, ఆ పాత్ర ప్రవర్తించే తీరు, పలికే మాటలు, కనబరిచే స్వభావం, సన్నివేశాలు జరిగే సందర్భం, తేదీలతో సహా తెరకెక్కించారు దాము బాలాజీ. ఆయన చేసిన పరిశోధన స్క్రీన్ మీద వ్యక్తమైంది. అలాగే సినిమాను సాధ్యమైనంత వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. దీంతో కథనంలో ఎక్కడా హీరోయిజం ఎలివేషన్స్, అక్కర్లేని కమర్షియల్ అంశాలకు తావులేకుండా అయ్యింది. నేరస్తుడు ఒక్కసారే నేరం చేస్తాడు.. కానీ వ్యవస్థ అనేకసార్లు నేరం చేసేలా పురికొల్పుతుంది అనేలా నయీం విషయంలోనూ జరిగినట్లుగా ఈ సినిమా చూపించారు. నక్సలైట్లు, పోలీసుల మధ్య ఆధిపత్య పోరులో నయీం ఒక్కోసారి ఒక్కో వర్గం వైపు ముందుండి నడిపించడం లాంటి సన్నివేశాలు చూస్తే.. నయీం మంచివాడనే వత్తాసు పలకకుండా బ్యాలెన్స్డ్ గా అనిపిస్తుంది. మనకు తెలియని పాత్రల ప్రభావం నయీం జీవితం మీద ఏంటి అనేది సినిమాలో చూపించారు.

Bigg Boss 5 : నువ్వు నాకు సిస్టర్ ఏంటి? బ్రో అని పిలవకు.. కాజల్ పై శ్రీరామ్ ఫైర్

నయీం క్యారెక్టర్ కు అలాగే రూపురేఖలు ఉండే నటుడిని తీసుకోవద్దు అనే దర్శకుడి ఆలోచన సరైనదే. వశిష్ట సింహా నయీం పాత్రలోనే ఇంటెన్సిటీని తన నటనలో చూపించారు. భావోద్వేగం, కుటుంబం మీద ప్రేమ, శత్రువుల మీద పగ, పట్టరాని ఆవేశం, క్రోధం లాంటి హావభావాలన్నీ వశిష్ట సింహా నటనలో చూస్తాం. నయీం సోదరిగా నటించిన యజ్ఞశెట్టి పాత్రోచితంగా నటించింది. లత పాత్రలో సంయుక్త పాత్ర సినిమాకు మరో ఆకర్షణ. తన ప్రేమనంతా మాటల్లో కాకుండా చూపుల్లోనే కనబర్చింది. జబర్దస్త్ ఫణి, దివి వద్యాత మిగతా పాత్రధారులంతా పాత్రల మేరకు నటించారు. సురేష్ భార్గవ్ సినిమాటోగ్రఫీ ప్రతి సీన్ ను ఎలివేట్ చేయాగా.. అరుణ్ ప్రభాకర్ సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కథకు ఏం కావాలో అది అందించాయి. సినిమాలో కథను అనుసరిస్తూ సాగిన హింసను కాస్త లైటర్ వేన్ లో చూపిస్తే ఫ్యామిలీ ఆడియెన్స్ కు చూసేందుకు ఇబ్బంది కలగకుండా ఉండేది. ఏమైనా ఒక భయపెట్టే వ్యక్తి బయోగ్రఫీలో ద్వారా అతని జీవితంలో సమాజానికి తెలియని నిజాలను చెప్పే ప్రయత్నం చేశారు.