Sudigali Sudheer : అభిమానులకి షాక్.. జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ అవుట్?? | Sudigali Sudheer out from jabardasth

Sudigali Sudheer : అభిమానులకి షాక్.. జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ అవుట్??

ఒక పక్క జబర్దస్త్ చేస్తూనే, మరో పక్క వేరే షోలకు యాంకర్ గా, సినిమాలలో కమెడియన్ గా, హీరోగా చేస్తున్నాడు. వీటి మధ్య ఒక్కోసారి జబర్దస్త్ షూటింగ్ కి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడని

Sudigali Sudheer : అభిమానులకి షాక్.. జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ అవుట్??

Sudigali Sudheer :  తెలుగు బుల్లితెరపై కొన్నేళ్లుగా ప్రేక్షకులను నవ్విస్తున్న కామెడీ షో జబర్దస్త్. ఈ షో తరువాత వేరే చానళ్లలో ఇదే ఫార్మేట్ లో చాలా కామెడీ ప్రోగ్రామ్‌లు వచ్చినప్పటికీ దీని రేంజ్ కి ఏది చేరుకోలేదు. ఈ షోతో పాటు ఇందులోని కమెడియన్స్‌కు కూడా మంచి పేరు వచ్చింది. మొదట్లో వారానికి ఒక రోజు వచ్చిన ఈ షో అభిమానుల ఆదరణ బాగుండటంతో ప్రస్తుతం వారానికి రెండు రోజులు జబర్దస్త్‌, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ గా వస్తుంది. ఈ షోతో చాలా మంది కమెడియన్స్ పేరుతో పాటు డబ్బులు బాగా సంపాదించారు. అందులో మెయిన్ గా సుడిగాలి సుధీర్‌.

Bigg Boss 5 : హౌస్ నుంచి జెస్సి అవుట్.. ఈ సారి కన్ఫర్మ్..

వేణు టీంలో కంటెస్టెంట్స్ గా వచ్చి టీంలీడర్ గా ఎదిగి తన కష్టంతో, తన ట్యాలెంట్ తో బుల్లితెర స్టార్ గా మారి ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్నాడు. జబర్దస్త్ లో ఫేమ్ రావడంతో సుధీర్ కి వేరే షోలతో పాటు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. కానీ ఎన్ని అవకాశాలు వచ్చినా జబర్దస్త్ ని మాత్రం వీడలేదు. ఆ స్టేజి మీద ఎన్నో సార్లు చెప్పాడు కూడా జబర్దస్త్ ని వీడను అని. కానీ ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే సుధీర్ జబర్దస్త్ నుంచి బయటకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు.

Vijay Devarakonda : అమెరికాలో రాత్రిపూట.. పూరితో రౌడీ రచ్చ

ఒక పక్క జబర్దస్త్ చేస్తూనే, మరో పక్క వేరే షోలకు యాంకర్ గా, సినిమాలలో కమెడియన్ గా, హీరోగా చేస్తున్నాడు. వీటి మధ్య ఒక్కోసారి జబర్దస్త్ షూటింగ్ కి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడని సమాచారం. జబర్దస్త్ షోని మల్లెమాల సంస్థ నిర్మిస్తుంది. ఇందులో యాక్ట్ చేసే వారంతా మల్లెమాలకి అగ్రిమెంట్ రాస్తారు. ఇది ఒకటి లేదా రెండు సంవత్సరాలకి రెన్యూవల్ చేస్తూ ఉంటారు. అగ్రిమెంట్ అయిపోయాక కావాలంటే వెళ్లిపోవచ్చు లేదా రెన్యూవల్ చేసుకొని ఉండొచ్చు. అయితే ఈ సారి సుధీర్ అగ్రిమెంట్ త్వరలో అయిపోతుంది. దీన్ని మళ్ళీ రెన్యూవల్ చేయించుకోడానికి సుధీర్ ఇష్టపడట్లేదని టాక్ వినిపిస్తుంది.

Rakul Preeth Sing : కండోమ్ టెస్టర్ గా రకుల్.. షాక్ లో ఫ్యాన్స్

దీంతో సుధీర్ జబర్దస్త్ నుంచి మల్లెమాల నుంచి బయటకు వెళ్ళిపోతాడు అనే వార్తలు వస్తున్నాయి. అయితే సుధీర్ కోసమే జబర్దస్త్ చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటింది. మల్లెమాల చేసే ఈవెంట్స్ లో సుధీర్ కనపడకపోతే యూట్యూబ్ లో కామెంట్స్ చేస్తారు సుధీర్ కోసం. అలాంటిది సుధీర్ వెళ్ళిపోతే జబర్దస్త్ కి ఇప్పుడు ఉన్నంత క్రేజ్ ఉంటుందా? టిఆర్పి తగ్గదా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ అభిమానులు కొంతమంది నిరాశ చెందుతూ సుధీర్ ని వెళ్ళొద్దని కామెంట్స్ చేస్తున్నారు.

Pushpaka Vimanam : రౌడీ తమ్ముడికి షాక్.. పెట్టిన బడ్జెట్ కూడా వచ్చేలా లేదు

అయితే సుధీర్‌ బయటకు వెళ్తే అతనితో పాటు అతని క్లోజ్ ఫ్రెండ్స్ గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ కూడా బయటికి వచ్చే ఛాన్స్‌ ఉంది. అదే జరిగితే జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ టీం పూర్తిగా ఉండదు. ఇది జబర్దస్త్ కి చాలా పెద్ద లాస్. అంతే కాక రష్మీ, సుధీర్ ని వాడుకొని ఈవెంట్స్, స్కిట్స్ కూడా చేయలేరు. వీళ్లిద్దరి వల్లే టిఆర్పి వచ్చిన రోజులు ఉన్నాయి. మరి మల్లెమాలకి బంగారు బాతు లాంటి సుధీర్ ని వదులుకోవడానికి ఇష్టపడుతుందా చూడాలి?

×