Varun Sandesh: మాస్‌ లుక్‌లో ఇరగదీసిన వరుణ్ సందేశ్

టాలీవుడ్‌లో ‘హ్యాపీ డేస్’ చిత్రంతో హీరోగా అదిరిపోయే గుర్తింపు సొంతం చేసుకున్న వరుణ్ సందేశ్, ఆ తరువాత పలు హిట్ సినిమాలు చేశాడు. అయితే కాలక్రమంలో వరుస ఫెయిల్యూర్స్‌తో అతడి సినిమాలకు క్రేజ్ తగ్గిపోయింది. ప్రస్తుతం ఆయన మరో వినూత్న కథతో తెరకెక్కబోతున్న ‘యద్భావం తద్భవతి’ అనే సినిమాలో పూర్తిగా మాస్ అవతారంలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.

Varun Sandesh: మాస్‌ లుక్‌లో ఇరగదీసిన వరుణ్ సందేశ్

Varun Sandesh Mass Look For Yadbhaavamtadbhavati Movie

Varun Sandesh: టాలీవుడ్‌లో ‘హ్యాపీ డేస్’ చిత్రంతో హీరోగా అదిరిపోయే గుర్తింపు సొంతం చేసుకున్న వరుణ్ సందేశ్, ఆ తరువాత పలు హిట్ సినిమాలు చేశాడు. అయితే కాలక్రమంలో వరుస ఫెయిల్యూర్స్‌తో అతడి సినిమాలకు క్రేజ్ తగ్గిపోయింది. కానీ ప్రస్తుతం విభిన్న కథాంశాలు, పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకునేందుకు మళ్లీ ప్రయత్నిస్తున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఆయన మరో వినూత్న కథతో తెరకెక్కబోతున్న ‘యద్భావం తద్భవతి’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

Varun Sandesh: ఈసారైనా హిట్ వచ్చేనా..?

ఈ సినిమాలో వరుణ్ సందేశ్ పూర్తిగా మాస్ అవతారంలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రసన్నభూమి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రసన్న లక్ష్మీ భూమి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రమేష్ జక్కల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్‌కు జోడిగా ఇనయ సుల్తానా నటిస్తోంది. కాగా నేడు వరుణ్ సందేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను యంగ్ హీరో సందీప్ కిషన్ విడుదల చేశారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వరుణ్ సందేశ్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా వరుణ్ సందేశ్ మాస్ అవతారంలో పూర్తిగా యాక్షన్ మోడ్‌లో కనిపిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన అనంతరం హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘మైఖెల్ సెట్‌లో వరుణ్ సందేశ్ బర్త్‌డే సందర్భంగా ‘యద్భావం తద్భవతి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. మైఖెల్ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నానో.. ఈ చిత్రం కోసం కూడా అంతే ఎదురుచూస్తున్నాను. ఈ పోస్టర్‌లో వరుణ్ సందేశ్ ఎంతో కొత్తగా కనిపిస్తున్నారు. మాస్‌కు రీచ్ అయ్యేలా ఉంది.’ అని అన్నాడు.

Varun Sandesh: వామ్మో.. మరీ ఇంత బోల్డా.. హాట్ టాపిక్‌గా వరుణ్ సందేశ్ కొత్త సినిమా పోస్టర్

ఇక హీరో వరుణ సందేశ్ మాట్లాడుతూ.. ‘నా సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేసినందుకు సందీప్ కిషన్‌కు థ్యాంక్స్. ఇలాంటి సర్‌ప్రైజ్ ఇచ్చిన మా నిర్మాత భూమి గారికి, దర్శకుడికి థ్యాంక్స్. ఈ అక్టోబర్ వస్తే ‘హ్యాపీ డేస్’ విడుదలై పదిహేనేళ్లు అవుతుంది. నా ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్’ అని అన్నాడు. డా.విక్రమ్ భూమి, దాసరి వెంకేటష్‌లు ఈ కథను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా మాస్ ప్రేక్షకులు మెచ్చేలా రచించారు. ఇక ఈ చిత్రానికి మిహిరమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు.