12 Cheethas : భారత్ కు మరో 12 చిరుతలు

భారత్ కు మరో 12 చిరుతలు రానున్నాయి. ఈ నెల 19న కూనో నేషనల్ పార్క్ కు ఇవి చేరుకోనున్నాయి. ఈ మేరకు అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు ప్రకటన చేశారు.

12 Cheethas : భారత్ కు మరో 12 చిరుతలు

Cheetahs

12 Cheethas : భారత్ కు మరో 12 చిరుతలు రానున్నాయి. ఈ నెల 19న కూనో నేషనల్ పార్క్ కు ఇవి చేరుకోనున్నాయి. ఈ మేరకు అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు ప్రకటన చేశారు. దక్షిణాఫ్రికాతో ఒప్పందంలో భాగంగా 12 చిరుతలు వస్తున్నట్లుగా చెప్పారు.

దక్షిణాఫ్రికా నుంచి ఈ తిరుతలు వాయు మార్గం ద్వారా తొలుత వాయోకు చేరుకుంటాయి. అక్కడి నుంచి కూనోకు రానున్నాయి. వాటిలో ఆడ, మగ చిరుతలు కూడా ఉన్నాయి. అయితే ఎన్ని మగ చిరుతలు, ఎన్ని ఆడ చిరుతలు అన్నది ఇంకా క్లారిటీ లేదు.

Cheetahs Again In India : 70 సంవత్సరాల తర్వాత భారత్‌లో మళ్ళీ చీతాలు.. మరో ఖండం నుంచి తీసుకురావడం ఇదే తొలిసారి

దక్షిణాఫ్రికా నుంచి చిరుతలు రాగానే వాటిని వెంనటే కూనో్ పార్క్ లోకి వదిలిపెట్టబోమని అటవీ అధికారులు చెప్పారు. నిబంధనల ప్రకారం.. వాటిని ఒక నెల రోజులపాటు క్వారంటైన్ లో ఉంచనున్నారు. ఆ తర్వాతే వాటిని కూనో పార్క్ లోకి వదులుతారు.