Cardiac Arrest : క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో 14ఏళ్ల బాలుడు మృతి

Cardiac Arrest : 9వ తరగతి చదువుతున్న వేదాంత్(14) క్రికెట్ ఆడుతున్నాడు. సడెన్ గా అతడు కిందపడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, లాభం లేకపోయింది.

Cardiac Arrest : క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో 14ఏళ్ల బాలుడు మృతి

Cardiac Arrest(Photo : Google)

Cardiac Arrest : గుండెపోటు మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేదు, ఏజ్ తో సంబంధమే లేదు. సడెన్ గా గుండెపోటుతో మరణిస్తున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు, ఎంతో హెల్తీగా ఉన్నవారు సైతం హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు వదులుతున్నారు. ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య బాగా పెరిగింది. యువతలోనూ హార్ట్ ఎటాక్స్ ఎక్కువ కావడం ఆందోళనకు గురి చేస్తోంది.

తాజాగా క్రికెట్ ఆడుతూ 14ఏళ్ల కుర్రాడు గుండెపోటుతో మరణించాడు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పుణె జిల్లాలోని వనవడిలో 9వ తరగతి చదువుతున్న వేదాంత్(14) క్రికెట్ ఆడుతున్నాడు. సడెన్ గా అతడు కిందపడిపోయాడు. వెంటనే స్నేహితులు వేదాంత్ తండ్రి విషయం చెప్పారు. వేదాంత్ ను అతడి తండ్రి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

Also Read..Heart Attack : సోమవారమే అధిక స్ధాయిలో గుండెపోటు ప్రమాదాలు చోటుచేసుకోవటానికి కారణాలు తెలుసా?

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వేదాంత్ మరణించాడు. తీవ్రమైన గుండెపోటు కారణంగానే వేదాంత్ చనిపోయాడని డాక్టర్లు వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. 14ఏళ్ల కుర్రాడు గండెపోటుతో చనిపోవడం ఏంటని అంతా నివ్వెరపోతున్నారు. కాగా, ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు పెరిగాయి.

Also Read..WHO Heart Attacks : గుండెపోటు మరణాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఇదే-డబ్ల్యూహెచ్ఓ కీలక నివేదిక

ఉదయం తన ఫ్రెండ్స్ తో కలిసి వేదాంత్ క్రికెట్ ఆడుతున్నాడు. సడెన్ గా అతడికి ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే తండ్రికి విషయాన్ని చెప్పాడు. అతడు హుటాహుటిని అక్కడికి వచ్చి కొడుకుని ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే వేదాంత్ పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు ఫాతిమానగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వేదాంత్ ను బతికించేందుకు డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. వేదాంత్ కార్డియాక్ అరెస్ట్ మరణించినట్లు అటాప్సీ రిపోర్టులో వెల్లడైంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. కార్డియాక్ అరెస్ట్‌కు ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.

ఇటీవలి కాలంలో ప్రజల్లో ముఖ్యంగా యువతలో పెరుగుతున్న గుండె జబ్బుల రేటు ఆందోళన కలిగిస్తుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, మారుతున్న జీవనశైలి గుండె జబ్బుల కేసుల పెరుగుదలకు ప్రధాన కారకాలు అని నిపుణులు చెబుతున్నారు.