రూ. 21 వేల జీతం ఉన్న వారికి, ఉపాధి కోల్పోయిన నిరుద్యోగులకు మూడు నెలల సగం జీతం

  • Published By: madhu ,Published On : August 21, 2020 / 11:46 AM IST
రూ. 21 వేల జీతం ఉన్న వారికి, ఉపాధి కోల్పోయిన నిరుద్యోగులకు మూడు నెలల సగం జీతం

unemployment

ఉపాధి పోయి..తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. ఈఎస్ఐసీ (ESIC) నిబంధనలు సడలించాలని నీతి ఆయోగ్ – కేంద్ర ఆర్థిక శాఖ రెండు నెలల కిందట సిఫార్సు చేశాయి. మూడు నెలల పాటు వారి సగటు జీతంలో 50 శాతం చెల్లించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.



దేశ వ్యాప్తంగా 41 లక్షల మంది కార్మికులకు దీనివల్ల లబ్ధి చేకూరనుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. సడలింపులు మార్చి 24వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వర్తించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపాదనను కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ నేతృత్వంలోని ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) బోర్డు ఆమోదించింది.

2018 ఏప్రిల్ 01వ నుంచి 2020 మార్చి 31 వరకు ESIC పథకంలో చేరి రెండేళ్లు అయి ఉండాల్సి ఉంటుంది. 2019, అక్టోబర్ 01 నుంచి 2020 మార్చి 31 మధ్యకాలంలో కనీసం 78 రోజులు జమ చేయాల్సి ఉంటుంది.




ESIC పథకం : –

రూ. 21 వేలలోపు జీతంతో పని చేసే కార్మికులు ఈఎస్ఐసీ (ESIC) లబ్ది పొందుతారనే విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి నెలా కార్మికుల మూల వేతనంలో 0.75 మొత్తాన్న జమ చేస్తుండగా..దీనికి యాజమాన్యాలు అదనంగా 3.25 జమ చేస్తాయి.

ఈ డ

బ్బును వైద్య అవసరాల కోసం, మందుల కోసం ఉపయోగించుకొనే అవకాశం ఉంది. నేరుగా ESIC కేంద్రాల్లో వీటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ యజమాని ద్వారా..బ్రాంచీ ఆఫీసు స్థాయిలోనే ఆమోదించబడుతుంది. క్లెయిమ్ మొత్తం నేరుగా కార్మికుడి ఖాతాకు పంపబడుతుంది.

ఉద్యోగం వదిలివేసిన 30 రోజుల నుంచి ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. కార్మకుల 12 అంకెల ఆధార్ సంఖ్య క్లెయిమ్ గుర్తింపు కోసం ఉపయోగిస్తారు.



దిక్కుమాలిన కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఎంతో మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఎంతో మంది సొంతూళ్లకు వెళ్లిపోయి ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇప్పటికే పలు ప్యాకేజీలను ప్రకటించింది.