ఢిల్లీ..56 శాతం మందిలో కోవిడ్ యాంటీబాడీస్..సర్వే నిర్ధారణ

ఢిల్లీ..56 శాతం మందిలో కోవిడ్ యాంటీబాడీస్..సర్వే నిర్ధారణ

Delhi Sero Survey : దేశ రాజధాని ఢిల్లీలో 56 శాతం మందికి కోవిడ్ యాంటీబాడీస్ ఉన్నట్లు సర్వే వెల్లడిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం, NDMC ఆధ్వర్యంలో కంటోన్మెంట్ ప్రాంతాలతో సహా..ప్రతి మున్సిపల్ వార్డు నుంచి 100 నమూనాలు సేకరించింది. జనవరి 15 నుంచి 23 మధ్య ఢిల్లీలో 28 వేల మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. 56.13 మందికి యాంటీబాడీస్ ఉన్నట్లు నిర్ధారించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇంతపెద్ద ఎత్తున సర్వే నిర్వహించలేదన్నారు. నార్త్ లో 49.09 శాతం, సౌత్ ఈస్ట్ లో 62.18 శాతంగా ఉందన్నారు.

56.13 శాతం కరోనా వ్యాధి సోకిందని, త్వరగానే కోలుకున్నారని, మొత్తంగా మహిళల్లో అధిక ప్రభావం చూపెటిందని వెల్లడించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఆధ్వర్యంలో 2020, జూన్ చివరి వారంలో మొదటి serological survey ను..నిర్వహించారు. తర్వాత..ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి నెలల్లో కూడా సర్వేలు నిర్వహించారు. కొత్త వ్యాధి కనుక..ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నూతన్ వెల్లడించారు. గత ఏడాది జులై లో నిర్వహించిన సర్వేలో 23 శాతం మందిలో antibodies ఉన్నాయని తేలింది.

ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో…29.1 శాతం మందికి antibodies ఉన్నాయిన తేలింది. ఈ సంఖ్య సెప్టెంబర్ లో 25.1 శాతం పడిపోయిందని, అక్టోబర్ నెలలో 25.5 శాతం ఉందని తేలింది. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో serosurvey నిర్శహించినట్లు, CLIA సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం జరిగిందని డాక్టర్ ముండేజా వెల్లడించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ సైన్సెస్ లో పరీక్షించినట్లు, 100 నమూనాలను తీసుకున్నట్లు వెల్లడించారు. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.