Panna Diamond: వజ్రం దొరికింది.. రైతు పొలంలో మూడు క్యారెట్ల వజ్రం.. ఏం చేశారంటే..

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారిపోయారు. లీజుకు తీసుకున్న గనిలో వారికి విలువైన 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

Panna Diamond: వజ్రం దొరికింది.. రైతు పొలంలో మూడు క్యారెట్ల వజ్రం.. ఏం చేశారంటే..

diamond

Panna Diamond: మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారిపోయారు. లీజుకు తీసుకున్న గనిలో వారికి విలువైన 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. జిల్లాలోని బ్రిజ్‌పుర్‌కు చెందిన రాజేంద్ర గుప్త అనే రైతు ఆరుగురు సహచరులతో కలిసి లల్కీధేరి అనే ప్రాంతంలో ఒక చిన్న వజ్రాల గనిని లీజుకు తీసుకున్నాడు. ఇందుకోసం వజ్రాల కార్యాలయం నుంచి లీజు పత్రాలను అందుకున్నాడు. నెల కంటే ఎక్కువ రోజులే నిరంతరాయంగా ఈ వజ్రాల గనిలో పనులు నిర్వహించారు. అయినా ఎలాంటి ఉపయోగం లేదు. తాజాగా గురువారం ఆ రైతులు మెరుస్తున్న 3.21 క్యారెట్‌ల వజ్రాన్ని గుర్తించారు. దానిని డైమండ్ ఆఫీసులో డిపాజిట్ చేశారు.

Panna Diamond Mine 13.54 carats : పన్నా వజ్రాల గనుల్లో.. గిరిజన కూలీకి దొరికిన 60 లక్షల విలువైన వజ్రం

వజ్రం లభించిన తర్వాత రైతు, అతని సహచరుల ఆనందానికి అవధులు లేవు. వజ్రాన్ని వేలం వేసి వచ్చిన డబ్బుతో అందరూ తమలో తాము సమానంగా పంచుకుని ఉపాధి కోసం ఏదో ఒక వ్యాపారం చేసుకుంటామని రైతులు చెబుతున్నాడు. మరోవైపు, ఇది బ్రైట్ టైప్ డైమండ్ అని, వచ్చే వేలంలో ఉంచుతామని, రాయల్టీని తీసివేసి, మిగిలిన డబ్బును రైతుకు ఇస్తామని అధికారులు చెప్పారు.

Unemployment Rate: ఏయే రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందో తెలుసా?

కొద్దిరోజుల క్రితం ఓ రైతుకుకూడా వజ్రం లభించడం గమనార్హం. పన్నా జరువాపూర్ గ్రామ పొలంలో ఓ రైతుకు రూ.30 లక్షల విలువైన వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని జిల్లా డైమండ్ కార్యాలయంలో రైతు అందజేశారు. అయితే నలుగురు రైతులు వజ్రంకోసం గత రెండేళ్లుగా పొలంలో గనులు తవ్వకాలు చేస్తున్నట్లు రైతు చెప్పాడు. మా శ్రమ ఫలించి ఈ వజ్రాన్ని పొందామన్నారు.