AAP : హేమాహేమీలను ఓడించిన లాభ్ సింగ్, జీవన్ జ్యోత్ కౌర్ ఎవరు ? నెటిజన్ల ఆసక్తి

పంజాబ్ లో ఎవరూ ఊహించని విధంగా ఆప్ దూసుకొచ్చింది. కాంగ్రెస్ ను మట్టికరిపించింది. అఖండ విజయం సాధించింది. రాష్ట్రంలో చీపురుతో క్లీన్ స్వీప్ చేసేసింది...

AAP : హేమాహేమీలను ఓడించిన లాభ్ సింగ్, జీవన్ జ్యోత్ కౌర్ ఎవరు ? నెటిజన్ల ఆసక్తి

Aap Punjab

Jyot Kaur And Labh Singh : పంజాబ్ లో ఎవరూ ఊహించని విధంగా ఆప్ దూసుకొచ్చింది. కాంగ్రెస్ ను మట్టికరిపించింది. అఖండ విజయం సాధించింది. రాష్ట్రంలో చీపురుతో క్లీన్ స్వీప్ చేసేసింది. ఆ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. హేమాహేమీలపై ఆప్ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో ఎవరి సపోర్టు లేకుండానే ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఎవరూ ఊహించని విధంగా…బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులను నిలబెట్టింది ఆప్.

Read More : AAP Punjab : పంజాబ్‌లో కొత్త చరిత్ర సృష్టించిన ఆప్‌.. జాతీయ పార్టీలను ఊడ్చి పారేసిన ‘చీపురు’

ప్రధానంగా ఎన్నికల్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూను ఆప్ మహిళా అభ్యర్థి ఓడించి వార్తల్లోకి ఎక్కారు. అమృత్ సర్ తూర్పు నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్ చేతిలో ఆయన పరాజయం చెందారు. శిరోమళి అకాలీదల్ నేత బిక్రమ్ మజీతియాను ఆప్ అభ్యర్థి లాభ్ సింగ్ ఓడించారు. ఇద్దరు హేమాహేమీలు ఓడించిన వీరు ఎవరని నెటిజన్లు వెతుకుతున్నారు. సామాజిక కార్యకర్త అయిన జీవన్ జ్యోత్ కౌర్ మహిళా సంక్షేమం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రధానంగా మహిళలు ఉపయోగించే శానిటరి నాప్ కిన్స్ లో విషయంలో మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు.

Read More : Punjab Elections Results: కాంగ్రెస్ ను చిత్తు చేసిన ఆప్..!

ప్లాస్టిక్ శానిటరీ ప్యాడ్ లను వాడొద్దని చెబుతోంది. పేదవారికి, నిరక్షరాస్యులైన వారికి చాలా విషయాలు చెబుతూ వారిలో మార్పు రావడానికి విశేష కృషి చేస్తున్నారు. అందుకే ఆమెను ప్యాడ్ ఉమెన్ ఆఫ్ పంజాబ్ అని పిలుస్తుంటారు. గ్రామీణ మహిళలు మళ్లీ మళ్లీ ఉపయోగించే శానిటరీ ప్యాడ్ల కోసం స్విట్టర్లాండ్ కు చెందిన కంపెనీ చేతులు కలిపారు. పేద, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. వారికి చదిపించడం, ఆరోగ్యం అందించడంతో పాటు తదితర సామాజిక అంశాల్లో పని చేస్తున్నారు. శ్రీ హేమకుంట్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. దీంతో ఆప్ దృష్టిలో పడిపోయారు. అభ్యర్థిగా నిలబెడితే బాగుంటుందని భావించి… ఆమెను బరిలోకి దింపారు. దీంతో ప్రజలు జీవన్ జ్యోతికి ఆదరించారు. ఆమెకే ఓట్లు వేయడంతో సునాయసంగా గెలుపొందారు. ఇప్పడూ అందరూ జీవన్ జ్యోతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read More : AAP Bhagwant Mann : భగత్ సింగ్ పుట్టిన గ్రామంలోనే సీఎంగా ప్రమాణం చేస్తా.. రాజ్ భవన్‌లో కాదు..!

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ పై ఆప్ అభ్యర్థి లాభ్ సింగ్ గెలుపొందారు. ఇతను సామాన్య వ్యక్తి. ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్న ఇతని తల్లి స్వీపర్ గా పని చేస్తుంటే.. తండ్రి వ్యవసాయ కూలి. కొద్దిరోజులు మొబైల్ లో రిపైర్ షాపులో పని చేశారు. ఆప్ పార్టీలో చేరి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పంజాబ్ ఎన్నికల్లో నిలబడి.. ఏకంగా సీఎంను ఓడించి అందరి మనస్సులను గెలుచుకున్నారు. జీవన్ జ్యోత్ కౌర్, లాభ్ సింగ్ విషయంలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. వారిద్దరు ఎవరో చెప్పారు. విజయం సాధించిన తర్వాత.. ఆప్ నిర్వహించిన సభలో కేజ్రీవాల్ మాట్లాడారు. సామాన్యుడు తలచుకుంటూ ఎమైనా చేయగలరని నిరూపించారని ప్రశంసించారు నవజ్యోత్ సింగ్ సిద్ధూను ఓడించింది ఓ సామాన్య వాలంటీర్ అయిన జీవన్ జ్యోత్ కౌర్ అని తెలిపారు. సామాన్య వ్యక్తితో సవాల్ చేయవద్దని… పెద్ద విప్లవాలు వస్తాయన్నారు.