Chidambaram Defections : గెలిచాక ఫిరాయిస్తే.. మళ్లీ ఎప్పటికీ పార్టీలో చేర్చుకునేది లేదు.. కాంగ్రెస్ కొత్త రూల్

గోవా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థులకు కాంగ్రెస్ కొత్త రూల్ తెచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి పార్టీ ఫిరాయిస్తే.. మళ్లీ ఎప్పటికీ వారిని..

Chidambaram Defections : గెలిచాక ఫిరాయిస్తే.. మళ్లీ ఎప్పటికీ పార్టీలో చేర్చుకునేది లేదు.. కాంగ్రెస్ కొత్త రూల్

Chidambaram

Chidambaram Defections : రాజకీయాల్లో నాయకుల పార్టీ ఫిరాయింపులు చాలా కామన్ గా మారాయి. ఓ పార్టీ టికెట్ మీద ఎన్నికల్లో గెలిచాక రాత్రికి రాత్రే మరో పార్టీలోకి జంప్ అయిపోతారు. ఈ మధ్య కాలంలో పార్టీ ఫిరాయింపులు మరీ ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. గోవా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థులకు కాంగ్రెస్ కొత్త రూల్ తెచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి పార్టీ ఫిరాయిస్తే.. మళ్లీ ఎప్పటికీ వారిని కాంగ్రెస్ లో చేర్చుకునేది లేదని ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం తేల్చి చెప్పారు.

Mahesh Babu: గౌతమ్‌ని డబ్బుంది కాబట్టి బతికించుకున్నాం.. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించా..

గోవా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలను అనౌన్స్ చేసింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకుగాను 36 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.

Coronavirus: వచ్చే 14రోజుల్లో గరిష్టస్థాయికి కరోనా కేసులు.. బీ-కేర్‌ఫుల్! – ఐఐటీ నిపుణులు

కాగా, 2017లో గోవా ఎన్నికల్లో 17 స్థానాల్లో విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినా ఫిరాయింపులతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని చిదంబరం గుర్తు చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్.. మరోసారి అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా.. ఎన్నికల్లో గెలిచాక పార్టీ ఫిరాయిస్తే అలాంటి వ్యక్తులను మరోసారి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ చేర్చుకునేది ముందుగానే వార్నింగ్ ఇచ్చేశారు. ఈ కొత్త రూల్.. ఏ మేరకు కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం కలిగిస్తుందో చూడాలి. ఫిబ్రవరి 14న గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.