Asaduddin Owaisi: ముస్లింలు ఎక్కువగా కండోమ్‌లు వాడుతున్నారు..! మోహన్ భగవత్ వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్..

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన సామాజిక ఆధారిత జనాభా అసమతుల్యత వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మీరు బాధపడకండి, ముస్లిం జనాభా పెరగడం లేదు, తగ్గుతోంది.. ఎందుకంటే కండోమ్‌లు మేము ఎక్కువగా వినియోగిస్తున్నాం. అయితే, మోహన్ భగవత్ దీనిపై మాట్లాడరు అంటూ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Asaduddin Owaisi: ముస్లింలు ఎక్కువగా కండోమ్‌లు వాడుతున్నారు..! మోహన్ భగవత్ వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్..

Asaduddin Owaisi

Asaduddin Owaisi: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన సామాజిక ఆధారిత జనాభా అసమతుల్యత వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మేము (ముస్లిం జనాభా) కండోమ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నామని అన్నారు. మీరు బాధపడకండి, ముస్లిం జనాభా పెరగడం లేదు, తగ్గుతోంది.. ఎందుకంటే కండోమ్‌లు మేము ఎక్కువగా వినియోగిస్తున్నాం. అయితే, మోహన్ భగవత్ దీనిపై మాట్లాడరు అంటూ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఒక సభలో అసదుద్దీన్ ప్రసంగించారు.

Asaduddin Owaisi: పీఎఫ్ఐ‌పై ఐదేళ్ల నిషేధాన్ని తప్పుపట్టిన ఓవైసీ.. తమ అభిప్రాయాన్ని చెప్పాలనుకునే ముస్లింలపై నిషేధమని వ్యాఖ్య..

దసరా పండుగ సందర్భంగా ఓ కార్యక్రమంలో.. మోహన్ భగవత్ మాట్లాడుతూ.. జనాభా అసమతుల్యత’ సమస్యను లేవనెత్తుతూ అన్ని సామాజిక వర్గాలకు సమానంగా వర్తించే విధంగా బాగా ఆలోచించి, సమగ్ర జనాభా నియంత్రణ విధానం కోసం పిలుపునిచ్చారు. కమ్యూనిటీ ఆధారిత జనాభా అసమతుల్యత అనేది ఒక ముఖ్యమైన అంశమని, దానిని విస్మరించరాదని వ్యాఖ్యానించారు. భగవత్ వ్యాఖ్యాలను అసదుద్దీన్ ఖండించారు. భగవత్ సాహబ్ నేను మిమ్మల్ని ఖురాన్ చదవమని ఆహ్వానిస్తున్నాను. పిండాన్ని చంపడం చాలా పెద్ద పాపమని అల్లా మాకు చెబుతున్నాడు. రెండు గర్భాల మధ్య అంతరాన్నిముస్లింలు చేస్తారు. కండోమ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తారని అన్నారు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే రికార్డుల ప్రకారం ముస్లింల మొత్తం సంతానోత్పత్తి రేటు రెండు శాతానికి తగ్గింది. మీరు చరిత్రను తప్పుగా సూచిస్తే అది మీ తప్పు అంటూ భగవత్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింల పరిస్థితి దారుణంగా ఉందని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వీధి కుక్కలకు లభించిన గౌరవం కూడా ముస్లింలకు దక్కడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.