Corona cases increased : భారత్‌ను మళ్లీ కమ్మేస్తోన్న కరోనా : 24 గంటల్లో 28,903 కొత్త కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మొదట ఐదు రాష్ట్రాలకే పరిమితమైన కరోనా విజృంభన ఇప్పుడు 12 రాష్ట్రాలకు చేరుకుంది.

Corona cases increased : భారత్‌ను మళ్లీ కమ్మేస్తోన్న కరోనా : 24 గంటల్లో 28,903 కొత్త కేసులు

Corona Cases Have Increased Massively In India1

Corona cases increased massively : భారత్‌ను మళ్లీ కరోనా కమ్మేస్తోంది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మొదట ఐదు రాష్ట్రాలకే పరిమితమైన కరోనా విజృంభన ఇప్పుడు 12 రాష్ట్రాలకు చేరుకుంది. 24గంటల్లో 28,903 కొత్త కేసులు నమోదయ్యాయి. ఐదు నెలల తర్వాత 28వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత సెప్టెంబర్‌30న 28వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా పెరిగిపోతోంది. దేశంలో ఈనెలలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గత వారం రోజులుగా 20వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు దాదాపు 29వేల కేసులు వచ్చాయి. దేశంలో సెకండ్‌వేవ్‌ మొదలైందని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో సెకండ్‌వేవ్‌ మొదలైందని ఆరోగ్యశాఖ ప్రకటించింది.

నిన్న ఒక్కరోజే 26 వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. ఒక దశలో 9 వేలకు తగ్గిన రోజువారీ కేసులు మళ్లీ 26 వేలకు చేరుకోవడంతో కేంద్రం అప్రమత్తమైంది. అందులో భాగంగానే కరోనా కట్టడికి ప్రధాని మోడీ మరోసారి …రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవుతున్నారు. కోవిడ్‌ 19ని నియత్రించేందుకు ఆయా రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో తెలుసుకోనున్నారు. అలాగే కొన్ని నగరాల్లో అమలవుతున్న లాక్‌డౌన్‌, నైట్‌ కర్ఫ్యూల ఫలితాలపై చర్చించనున్నారు. దీంతో పాటు కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగవంతం చేయడంపై ముఖ్యమంత్రులు, ప్రధాని చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా…. ఇప్పటి వరకు 3.15 కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందించారు. మరో 10 కోట్ల డోసుల వ్యాక్సిన్లకు ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చింది.

గతేడాది ఆగష్టులో విధించిన కఠిన నిబంధనలు మరోసారి అమలు చేయాలని మహారాష్ట్రకి సూచించింది కేంద్రం. దీంతో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న మిగిలిన రాష్ట్రాలకు ఏ తరహా సూచనలు చేస్తారు….. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల విషయంలో ఎటువంటి అదనపు జాగ్రత్తలు తీసుకుంటానేది ఆసక్తిగా మారింది. గత కొంత కొంత కాలంగా కేంద్రం నిర్వహించే పలు సమావేశాలకు గైర్హాజరవుతూ వస్తోన్నా…. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ , గాయంతో బాధపడుతున్నా….. వీల్‌ చైర్‌లోనే ఈ సమావేశానికి హాజరవుతున్నారు.

ప్రస్తుతం దేశంలో 2 లక్షల 19 వేల 262 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో పరిస్థితి విషమించింది. కరోనా సెకండ్‌ వేవ్‌ ముంగిట్లో మహారాష్ట్ర ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కేసుల తీవ్రత పెరిగిపోవడంతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో నైట్‌ కర్ఫ్యూలు, పరిమిత లాక్‌డౌన్‌లు విధిస్తున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా విద్యాసంస్థల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాత ప్రజలు కోవిడ్‌ నిబంధనలను పెద్దగా పట్టించుకోవడం లేదు. తిరిగి సాధారణ జీవితంవైపు మళ్లుతున్నారు. అయితే మరోసారి కేసుల్లో పెరుగుదల మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎంలతో నిర్వహించే వర్చువల్ సమావేశంలో ప్రధానీ మోడీ కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది.