Corona :  దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గత వారం 30 వేలకు దిగువన నమోదైన కేసులు.. గురు, శుక్రవారాల్లో 30 వేలు దాటాయి.

Corona :  దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

Corona Update

Corona :  దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గత వారం 30 వేలకు దిగువన నమోదైన కేసులు.. గురు, శుక్రవారాల్లో 30 వేలు దాటాయి. కాగా గడిచిన 24 గంటల్లో 34,403 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,33,81,728కు చేరింది. ఇక ప్రస్తుతం 3,49,056 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More : Covid-19 : కొవిడ్‌ సోకిన గర్భిణుల్లో ఇన్పెక్షన్‌ ముప్పు ఎక్కువ!

ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లిన వారి సంఖ్య 3,25,98,424 గా ఉంది. ఇక కరోనా మహమ్మారి సోకి 4,44,248 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 37,950 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 320 మంది మృతి చెందారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. దేశంలో 77,24,25,744 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. ఒక్క రోజులోనే 63,97,972 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని పేర్కొన్నది.

Read More : Tirupati : ఈసారి కూడా ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు

కరోనా కేసులు కేరళ రాష్ట్రంలో విపరీతంగా నమోదవుతున్నాయి. కేసుల తీవ్రతతోపాటు మృతుల సంఖ్య కూడా ఇక్కడే అధికంగా ఉంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో కేరళ నుంచే 70 శాతం కేసులు వస్తుండటం ఆందోళన కలిగించే అంశం.