Coronavirus India : దేశంలో తగ్గుతున్న కరోనా.. కొత్త కేసులకన్నా రికవరీలే ఎక్కువ

కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి. లాక్ డౌన్లు, ఆంక్షలు పని చేస్తున్నాయి.

Coronavirus India : దేశంలో తగ్గుతున్న కరోనా.. కొత్త కేసులకన్నా రికవరీలే ఎక్కువ

Coronavirus India Live Updates 1 32 Lakh Fresh Covid 19 Cases In India

Coronavirus India : కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి. లాక్ డౌన్లు, ఆంక్షలు పని చేస్తున్నాయి. దేశంలో కరోనా తీవ్రత క్రమంగా అదుపులోకి వస్తోంది. కొన్ని రోజులుగా కరోనా కొత్త కేసులు తగ్గాయి. అదే సమయంలో రికవరీల సంఖ్య పెరిగింది. తాజా కేసుల సంఖ్య 1.5లక్షలకు దిగువన నమోదవుతుండటం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,32,788 కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే క్రితం రోజు(1,27,510)తో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఇక మరణాల సంఖ్య కూడా కాస్త పెరిగింది. క్రితం రోజు 2వేల 795 మరణాలు సంభవిస్తే.. తాజాగా ఆ సంఖ్య 3,207కి చేరింది.

తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 2,83,07,832. గడిచిన 24 గంటల్లో 3వేల 207 మంది కరోనాతో చనిపోయారు. దీంతో ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య 3,35,102. కొన్ని రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే రికవరీలే అధిక సంఖ్యలో ఉండటం ఊరట కలిగిస్తోంది. తాజాగా 2లక్షల 31వేల 456 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 2,61,79,085కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 92.48 శాతంగా ఉంది.

ప్రస్తుతం దేశంలో 17,93,645 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 20,19,773 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 35 కోట్లకు చేరింది. భారత్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు పెరిగాయి. దేశవ్యాప్తంగా 2వేల 600 ల్యాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా 1,266 ప్రభుత్వ ల్యాబ్స్.. 1,334 ప్రైవేట్ ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయని ఐసీఎంఆర్ తెలిపింది.

* దేశంలో 6.57 శాతానికి తగ్గిన పాజిటివిటి రేటు
* తొమ్మిది రోజులుగా 10 శాతానికి దిగువన పాజిటివిటి రేటు
* 20 రోజులుగా కొత్త కేసులకన్నా అధికంగా రికవరీ కేసులు
* దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,83,07,832 కరోనా కేసులు నమోదు..
* దేశవ్యాప్తంగా కరోనాతో 3,35,102 మంది మృతి
* ప్రస్తుతం దేశంలో 17,93,645 యాక్టివ్ కేసులు.. 2,59,47,629 మంది డిశ్చార్జ్
* 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తగ్గుతున్న కరోనా కేసులు
* ఐదు రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు
* కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ లో అధికంగా యాక్టివ్ కేసులు
* దేశంలో భారీగా తగ్గుతున్న యాక్టివ్ కేసులు.. పెరుగుతున్న రికవరీ కేసులు
* ఒక్కరోజులో 1,01,875 తగ్గిన యాక్టివ్ కేసులు.. కోలుకున్న 2,31,456 లక్షల మంది
* 92.48 శాతానికి పైగా కరోనా రికవరీ రేటు, 6.34 శాతం యాక్టీవ్ కేసులు, మరణాల రేటు 1.18 శాతం