ఇండియాకు బిగ్ రిలీఫ్.. 6 నెలల్లో తొలిసారిగా 3లక్షల దిగువకు యాక్టివ్ కేసులు

కరోనా మహమ్మారి దెబ్బకు విలవిలలాడిన ఇండియాకు ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 26,041 కేసులు నమోదయ్యాయి. మరో 27

ఇండియాకు బిగ్ రిలీఫ్.. 6 నెలల్లో తొలిసారిగా 3లక్షల దిగువకు యాక్టివ్ కేసులు

Covid 19

Covid-19 : కరోనా మహమ్మారి దెబ్బకు విలవిలలాడిన ఇండియాకు ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 30 వేల దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులు తగ్గుతుండటంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 3 లక్షల దిగువకు పడిపోయింది. గత ఆరు నెలల్లో ఇదే తొలిసారి. ఇక మరణాల సంఖ్య కూడా 300 లోపే నమోదైంది. ఈ లెక్కకు కాస్త ఊరటనిస్తున్నాయి.

గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 11,65,006 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,041 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కేరళలో 15,951.. మహారాష్ట్రలో 3వేల 206 కేసులు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా మరో 276 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,36,78,786 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,47,194 కి చేరింది.

Google Chrome వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. వెంటనే ఈ పని చేయండి

కాగా.. నిన్న కరోనా నుంచి 29వేల 621 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,29,31,972 కి పెరిగింది. రికవరీల సంఖ్య 3.29 కోట్లకు పెరిగింది. రికవరీ రేటు 97.78 శాతంగా ఉంది.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 3లక్షల దిగువకు చేరాయి. ప్రస్తుతం 2,99,620 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 3లక్షలకు దిగువకు చేరడం గత ఆరు నెలల్లో ఇదే తొలిసారి. బీహార్, రాజస్తాన్, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు మూడు కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్, డామన్, డయూలో యాక్టివ్ కేసులు 100 కంటే తక్కువకు చేరుకున్నాయి.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో పంపిణీ అయిన టీకా డోసుల సంఖ్య కాస్త తగ్గింది. నిన్న 38.18 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు 86 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

Mango Leaves : షుగర్ లెవల్స్ తగ్గించే మామిడాకులు…ఎలా ఉపయోగించాలో తెలుసా?

మరోవైపు కేరళ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. నిన్న దేశంలో నమోదైన కరోనా కేసుల్లో కేరళలో 15,951 కేసులు నమోదు కాగా.. 165 మంది మరణించారు. దేశంలోని యాక్టివ్ కేసుల్లో 55శాతం కేరళ నుంచే ఉన్నాయి. కేరళలో 1.63లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళ తర్వాత మహారాష్ట్రలో అత్యధికంగా 37వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

దేశంలో కరోనా మహమ్మారి ప్రస్తుత స్థితి రెండవ వేవ్ రాకముందు, ఫిబ్రవరి మధ్యలో ఉన్న పరిస్థితిని పోలి ఉంది. 20 కి పైగా రాష్ట్రాలు ప్రతిరోజూ 100 కంటే తక్కువ కేసులను నివేదిస్తున్నాయి. వాటిలో పది కొత్త కేసుల కంటే తక్కువ ఉన్నాయి. ఆ సమయంలో కూడా, సగానికి పైగా కేసులు మహారాష్ట్ర, కేరళ నుండి వచ్చాయి. ఈసారి కేరళలో కరోనా తీవ్రత మరింత ఎక్కువగా ఉంది.

తాజాగా 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సున్నా కరోనా మరణాలు నమోదు కావడం ఊరటనిచ్చే అంశం. గత వారం రోజులుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 200కన్నా ఎక్కువగా ఉంది. వాటిలో 60శాతం మరణాలు ఒక్క కేరళ రాష్ట్రం నుంచే నమోదవుతున్నాయి.