Corona Children : కొవిడ్ పంజా.. 10 రోజుల్లో 1260 మంది పిల్లలకు కరోనా

ఒడిశాను కరోనావైరస్ మహమ్మారి బెంబేలెత్తిస్తోంది. చిన్నపిల్లలే టార్గెట్ గా పంజా విసురుతోంది. 24 గంటల్లో 131 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

Corona Children : కొవిడ్ పంజా.. 10 రోజుల్లో 1260 మంది పిల్లలకు కరోనా

Corona Children

Corona Children : ఒడిశాను కరోనావైరస్ మహమ్మారి బెంబేలెత్తిస్తోంది. చిన్నపిల్లలే టార్గెట్ గా పంజా విసురుతోంది. 24 గంటల్లో 131 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 10 రోజుల్లో 1260 మంది పిల్లలు వైరస్ బారిన పడ్డారు. దీంతో ఒడిషా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. వైరస్ బారిన పడే పిల్లల సంఖ్య పెరుగుతుండటం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది.

బుధవారం రాష్ట్రంలో 887 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,03,210కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 8,226. కొత్తగా నమోదైన 887 కేసుల్లో 131 మంది పిల్లలే. 0 నుంచి 18ఏళ్ల లోపు వారు కోవిడ్ బారిన పడ్డారు. పాజిటివిటి రేటు 1.29%గా ఉంది.

ఆగస్టు 15వ తేదీ వరకు 7వేల 430 మంది కరోనా బారిన పడగా, అందులో 948 మంది పిల్లలే(0-18ఏళ్లు) ఉన్నారు. మొత్తం ఇన్ ఫెక్షన్లలో పిల్లల శాతం 12.75గా ఉంది. రాష్ట్రంలో స్కూళ్లు రీఓపెన్ చేశారు. 9, 10 తరగతి విద్యార్థులకు క్లాసులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కేసులు పెరగడం అటు అధికారులను ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. భువనేశ్వర్ లోని మూడు ప్రైవేట్ స్కూళ్లు, ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కోవిడ్ బారినపడ్డారు.

కరోనా కేసులు పెరుగుతుండటంతో.. మిగతా క్లాసులు ఓపెన్ చేయడంపై ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారానికి ప్రభుత్వం తన నిర్ణయం చెప్పే అవకాశం ఉంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి ఆమోదం రాగానే 12ఏళ్ల వయసు పైబడిన పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తామని అధికారులు చెప్పారు.