పెరుగుతున్న కరోనా కేసులు…అహ్మదాబాద్ లో నైట్ కర్ఫ్యూ

  • Published By: venkaiahnaidu ,Published On : November 19, 2020 / 06:52 PM IST
పెరుగుతున్న కరోనా కేసులు…అహ్మదాబాద్ లో నైట్ కర్ఫ్యూ

Curfew to be imposed in Ahmedabad కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అహ్మదాబాద్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సిటీలో రాత్రి 9గంటల నుంచి ఉదయం 6గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించాలని అహ్మదాబాద్ యంత్రాంగం నిర్ణయించింది.



పండుగ సీజన్ లో ఒక్కసారిగా కొత్త కరోనా కేసులు పెరిగిపోయిన నేపథ్యంలో అహ్మదాబాద్ సీటీలోని హాస్పిటల్స్ లో కరోనా పేషెంట్స్ కోసం తగినన్ని బెడ్స్ ను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 40శాతం బెడ్లు హాస్పిటల్స్ లో కరోనా పేషెంట్లకు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని అడిషనల్ చీఫ్ సెక్రటరీ రాజీవ్ కుమార్ గుప్తా తెలిపారు. అహ్మదాబాద్ సిటీలో కోవిడ్-19 స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ గా రాజీవ్ కుమార్ గుప్తా నియమితులైన విషయం తెలిసిందే.



అహ్మదాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 46వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ ఒక్క జిల్లాలోనే దాదాపు 2వేల కరోనా మరణాలు నమోదయ్యాయని తెలిపింది. కరోనా నుంచి కోలుకుని హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జి అయినవారి సంఖ్య 41వేలకు చేరుకుంది.

కాగా,గుజరాత్ లో కరోనా కేసుల సంఖ్య 1లక్ష 93వేలు దాటింది. దాదాపు 4వేల కరోనా మరణాలు రాష్ట్రంలో నమోదయ్యాయి. 1లక్షా 76వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు.