Cyclone Sitrang: బలపడుతోన్న సిత్రాంగ్ తుపాను.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అప్రమత్తమైన అధికారులు

‘సిత్రాంగ్’ తుపాను మరింత బలపడుతోంది. ఈ తుపాను ప్రభావంతో ఆరు నుంచి ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ తుపాను బంగ్లాదేశ్ వైపుగా సాగుతోంది.

Cyclone Sitrang: బలపడుతోన్న సిత్రాంగ్ తుపాను.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అప్రమత్తమైన అధికారులు

Cyclone Sitrang: ‘సిత్రాంగ్’ తుపాను బలపడుతోంది. ఈ తుపాను ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్షపు ముప్పు పొంచి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ‘సిత్రాంగ్’ ప్రభావంతో అసోం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Mumbai Businessman: అమ్మాయిని ‘ఐటమ్’ అన్న వ్యాపారి.. జైలు శిక్ష విధించిన కోర్టు

ప్రస్తుతం ఈ తుపాను బంగ్లాదేశ్ దిశగా సాగుతోంది. అక్కడ కూడా దీని ప్రభావం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మరోవైపు తుపాను ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వర్షం ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా సహాయక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాల విపత్తు, నిర్వహణా బృందాల్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ, హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే 12 గంటలపాటు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ప్రస్తుతం తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

Kerala CM: కేరళలో సీఎం వర్సెస్ గవర్నర్.. వీసీల రాజీనామా నిర్ణయంపై కోర్టుకు ప్రభుత్వం

తర్వాత ఈ వేగం మరింత పెరుగుతుందని అధికారులు అంటున్నారు. తుపాను ప్రభావంతో కోల్‌కతా నగరంలో గాలులు వేగంగా వీస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ గాలులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. మంగళవారం ఉదయం వరకు తుపాను తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో దీని వేగం గంటకు 80-90కి చేరుకునే అవకాశం ఉంది.