Odisha Train Accident : ఒడిశా ఘోర రైలు ప్రమాదం.. 288కి పెరిగిన మృతుల సంఖ్య

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం ఉండటమే కారణం అని తెలిపారు. గూడ్స్ ను ఢీకొట్టడంతో బోగీలు గాల్లోకి..

Odisha Train Accident : ఒడిశా ఘోర రైలు ప్రమాదం.. 288కి పెరిగిన మృతుల సంఖ్య

Odisha Train Accident (Photo : Google)

Odisha Train Accident – Coromandel Express : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది. గతంలో ఎప్పుడూ ఇంతటి భయానకమైన ప్రమాదం జరిగింది లేదని, ఇంత మంది చనిపోయింది, గాయపడిందని లేదని రైల్వే అధికారులు అంటున్నారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు దుర్ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఇప్పటివరకు 288 మంది మరణించారు. వెయ్యి మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారని రైల్వే అధికారులు వెల్లడించారు. ఒడిశాలో మూడు రైళ్లు(బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు) ఢీకొనడంతో భారీ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన రెండు రైళ్లలో 3వేల 400 మందికిపైగా ప్యాసింజర్లు ప్రయాణం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.(Odisha Train Accident)

Also Read..Railway Insurance : రూపాయి కన్నా తక్కువ మొత్తంతో రూ.10 లక్షలు రైల్వే బీమా .. ఎలా అప్లై చేసుకోవాలంటే?

రైలు ప్రమాదంలో అంతమంది మరణించడానికి కారణం ఇదే- షాకింగ్ విషయం చెప్పిన రైల్వేస్
ఇకపోతే.. ఈ ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం సంభవించింది. వందల మంది మరణించారు. అసలు.. ఈ స్థాయిలో ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? భారీ స్థాయిలో ప్రాణనష్టం జరగడానికి రీజన్ ఏంటి? అంతమంది ఎలా చనిపోయారు? దేశ ప్రజలందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న ఇది. దీనికి రైల్వే అధికారులు షాకింగ్ కారణం చెప్పారు.

ఒడిశా రైలు ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం ఉండటమే కారణం అని రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ సిన్హా తెలిపారు. ఇనుప ఖనిజం లోడుతో ఆగి ఉన్న గూడ్స్ ను కోరమాండల్ ఢీకొట్టడంతో దాని బోగీలు గాల్లోకి ఎగిరి కిందపడ్డాయని చెప్పారు. దాంతో భారీ సంఖ్యలో మరణాలు, గాయాలకు దారితీసిందని వెల్లడించారు. ఇక కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొడితే.. ఇనుప ఖనిజం వల్ల గూడ్స్ రైలు బోగీలు ఇంచు కూడా కదల్లేదన్నారు.(Odisha Train Accident)

Also Read..Life Insurance Corporation : ఒడిశా రైలు దుర్ఘటన బాధితులకు బాసటగా ఎల్ఐసీ

శుక్రవారం(జూన్ 2,2023) రాత్రి ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. వందల మంది మరణించారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. 128 కిలోమీటర్ల వేగంతో వచ్చిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు.. గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో కొన్ని బోగీలు గాల్లోకి ఎగిరి కిందపడ్డాయి. అదే సమయంలో మరో ట్రాక్ లో 124 కిలోమీటర్ల స్పీడ్ తో వచ్చిన యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ రైలు చివరి 4 బోగీలను కోరమాండల్ రైలు బోగీలు ఢీకొట్టాయి. దాంతో ఘోరం జరిగిపోయింది.

ఈ దుర్ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రమాదం కాదని ఆయన అన్నారు. సిగ్నలింగ్ పాయింట్‌లో మార్పుల వల్లే ఈ దారుణం జరిగిందని వివరించారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌ సిస్టంలో మార్పులు చేశారని, ఆ మార్పుల వల్లే ఇంతటి ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. కవచ్‌ లేకపోవడం ప్రమాదానికి కారణం కాదని మంత్రి తేల్చి చెప్పారు. సిగ్నలింగ్‌ పాయింట్‌లో మార్పులు చేసిన వారిని గుర్తించామని, త్వరలోనే వారిపై చర్యలు ఉంటాయన్నారు.