Delhi mayor election: రేపు మరోసారి ఢిల్లీ మేయర్ ఎన్నిక.. ఈ సారైనా జరిగేనా?

250 స్థానాలుగల ఢిల్లీ మున్సిపాలిటీలో ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లు గెలుచుకుంది. మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన సీట్లు గెలుచుకుంది. దీంతో ఆ పార్టీకి మేయర్ పీఠం సులభంగా దక్కుతుందని భావించారు. అయితే, రెండు నెలలైనప్పటికీ మేయర్ ఎన్నిక పూర్తి కాలేదు.

Delhi mayor election: రేపు మరోసారి ఢిల్లీ మేయర్ ఎన్నిక.. ఈ సారైనా జరిగేనా?

Delhi mayor election: ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్ర్రక్రియ సోమవారం (ఫిబ్రవరి 6) జరగబోతుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ రెండుసార్లు ప్రారంభమై, వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు నెలలు అవుతోంది.

Women’s Premier League: మహిళా ప్రీమియర్ లీగ్.. ముంబై ఇండియన్స్ కోచ్‌లుగా ఝులన్ గోస్వామి, చార్లెట్ ఎడ్వర్డ్స్

250 స్థానాలుగల ఢిల్లీ మున్సిపాలిటీలో ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లు గెలుచుకుంది. మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన సీట్లు గెలుచుకుంది. దీంతో ఆ పార్టీకి మేయర్ పీఠం సులభంగా దక్కుతుందని భావించారు. అయితే, అనేక పరిణామాల నేపథ్యంలో రెండు నెలలైనప్పటికీ మేయర్ ఎన్నిక పూర్తి కాలేదు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్, 1957 ప్రకారం.. మొదటి మున్సిపల్ సమావేశాల్లోనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తి కావాలి. కానీ, ఇప్పటికి రెండుసార్లు సమావేశం జరిగినప్పటికీ ఎన్నిక పూర్తి కాలేదు.

Smartphone Revenue: తగ్గిపోతున్న స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు… గత ఏడాది ఎంత తగ్గాయంటే?

జనవరి 6, జనవరి 24 తేదీల్లో జరిగిన సమావేశాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య తలెత్తిన అనేక వివాదాల నేపథ్యంలో ఎన్నిక వాయిదా పడింది. దీంతో ఈ నెల 6న తిరిగి ఎన్నిక నిర్వహించాలని నిర్వహించారు. రేపైనా ఎన్నిక సక్రమంగా జరుగుతుందో.. లేదో చూడాలి. మేయర్ పదవి కోసం ఆప్ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఐదేళ్లు.. ఐదుగురిని మేయర్లుగా ఎన్నుకోవాలని నిర్నయించింది. ఆప్ తరఫున మొదటి ఢిల్లీ మయేర్‌గా షెల్లీ ఒబెరాయ్ ఎన్నికయ్యే అవకాశం ఉంది.